Begin typing your search above and press return to search.

నాని అక్క ద‌ర్శ‌క‌త్వం

By:  Tupaki Desk   |   14 Jun 2021 5:30 PM GMT
నాని అక్క ద‌ర్శ‌క‌త్వం
X
హీరోలు లేదా ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌ అక్క‌లు, చెల్లెల్లు, భార్య‌లు సినీ రంగంలోకి రావ‌డం కొత్తేమీ కాదు. ఐతే వాళ్లు చాలా వ‌ర‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ లాంటి బాధ్య‌త‌లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక హీరోగారి సోద‌రి ఏకంగా ద‌ర్శ‌క‌త్వ‌మే చేప‌డుతుండ‌టం విశేషం. ఆ హీరో నాని కాగా.. మెగా ఫోన్ పడుతున్న‌ది అత‌డి అక్క అయిన గంటా దీప్తి. నాని సొంత బేన‌ర్ వాల్ పోస్ట‌ర్ సినిమాలో ప్ర‌శాంతి నిర్మాత‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. ఈ రోజే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అ!, హిట్ సినిమాల త‌ర్వాత ఈ బేన‌ర్లో తెర‌కెక్కుతున్న రెండు చిత్రాల్లో ఇదొక‌టి. ఇప్ప‌టికే హిట్-2 సినిమాను అనౌన్స్ చేయ‌గా.. ఇప్పుడు మీట్ క్యూట్ గురించి వెల్ల‌డించారు.
ఈ సినిమా గురించి ప్ర‌క‌టిస్తూ ద‌ర్శ‌కురాలిగా గంటా దీప్తి పేరును అనౌన్స్ చేయ‌గానే చాలామందికి ఆశ్చ‌ర్యం క‌లిగింది. ఎందుకంటే గంటా అనేది నాని ఇంటి పేరు. అత‌డి అస‌లు పేరు గంటా న‌వీన్ బాబు అన్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి గంటా దీప్తి అంటే నాని కుటుంబ స‌భ్యురాలే అయ్యుంటుంద‌నిపించింది. ఆమె గురించి ఆరా తీస్తే నాని సొంత అక్క అని వెల్ల‌డైంది. ఇలా ఒక పాపుల‌ర్ హీరో అక్క ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతుండ‌టం టాలీవుడ్లో ఇదే తొలిసారి అయ్యుండొచ్చు. మీట్ క్యూట్ ఒక ప్ర‌యోగాత్మ‌క లేడీ ఓరియెంటెడ్ మూవీ అంటున్నారు. త‌క్కువ బడ్జెట్లో, ప‌రిమిత కాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఇందులో త‌మిళ సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్ లొకేష‌న్ ఫొటోల్లో ఆయ‌న క‌నిపించ‌గా.. ఇందులో లీడ్ రోల్ చేస్తున్న అమ్మాయి ముఖాన్ని దాచి పెట్టారు. ఆ పాత్ర‌ను నివేథా థామ‌స్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.