Begin typing your search above and press return to search.

అవకాశం చాలా దూరం వెళ్లిన ఆర్ఎక్స్‌100 డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   30 July 2022 12:30 AM GMT
అవకాశం చాలా దూరం వెళ్లిన ఆర్ఎక్స్‌100 డైరెక్టర్‌
X
రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీ నుండి బయటకు వచ్చిన దర్శకుల్లో అజయ్ భూపతి ఒకరు. గురువు వర్మ తరహా సినిమాలు కాకుండా మొదటి ప్రయత్నమే ఆర్ఎక్స్‌ 100 వంటి విభిన్నమైన కమర్షియల్‌ సినిమాను చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతా కొత్త వారితో అజయ్‌ భూపతి చేసిన ఆర్ ఎక్స్ 100 సినిమా భారీ కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మొదటి సినిమా సినిమాతోనే టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.

అజయ్ భూపతి తదుపరి సినిమా కోసం ఏకంగా రెండేళ్ల సమయం తీసుకుని మహా సముద్రం అనే సినిమా ను చేశాడు. మహాసముద్రం ఫలితం ఏంటో అందరికి తెల్సిందే. మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో పలువురు యంగ్‌ హీరోలు డేట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. కాని మహాసముద్రం ఫలితం తో చాలా మంది నిర్మాతలు ఈయనకు మొహం చాటేశారట. దాంతో ఈయన ఆఫర్‌ ల కోసం చాలా దూరం వెళ్లాడు.

తనకు బాలీవుడ్‌ లో ఉన్న పరిచయాలతో ముంబై లో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్‌ హిరానీ ని కలిశాడు. ఆయన తో తన వద్ద ఉన్న పలు ఐడియాలను షేర్ చేసుకున్నాడు. ఇంతకు ముందు సినిమాల యొక్క వర్క్‌ మరియు తాజా ఐడియాస్ కు ఇంప్రెస్ అయిన రాజ్‌ కుమార్‌ హిరానీ కచ్చితంగా కలిసి వర్క్ చేద్దాం అంటూ అజయ్ భూపతికి హామీ ఇచ్చాడట.

అజయ్‌ భూపతి రెడీ చేసిన రెండు కథలు బాలీవుడ్‌ దర్శకుడికి బాగా నచ్చాయట. దాంతో త్వరలోనే ఆయన ఆధ్వర్యంలో ఒక హిందీ సినిమా ను అజయ్‌ భూపతి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అజయ్ భూపతి చేయబోతున్న ఆ హిందీ సినిమా ను తెలుగు లో కూడా అదే సమయంలో రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజ్ కుమార్‌ హిరానీ సినిమా ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా సినిమా అంటేనే బాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. అందుకే ఆయనతో అజయ్ భూపతి సినిమా అంటే కచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుందని అక్కడ ఇక్కడ మంచి హైప్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి మహాసముద్రం ఫ్లాప్‌ తో ఢీలా పడకుండా బాలీవుడ్ వరకు అవకాశం కోసం వెళ్లిన అజయ్ భూపతి పట్టుదలను అభినందించకుండా ఉండలేం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో సక్సెస్ అయితే టాలీవుడ్‌ హీరోలు మళ్లీ పిలిచి మరీ డేట్లు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.