Begin typing your search above and press return to search.

గ్యాంబ్లింగ్.. సినిమా ఒకటేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2017 6:00 AM GMT
గ్యాంబ్లింగ్.. సినిమా ఒకటేనా?
X
ఆల్ఫాన్సో పుత్రేన్.. ఈ పేరు తెలుగువాళ్లలో చాలామందికి తెలియదు. కానీ నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా ఒరిజినల్ మళయాళ వెర్షన్ దర్శకుడు అంటే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఒక యువకుడి జీవితంలోని మూడు దశల్లో ఎదురైన సంఘటనలతో అందమైన కథ రూపొందించి దానిని దృశ్యకావ్యంలా మలిచిన దర్శకుడు. ఈ సినిమాతోనే అనుపమ పరమేశ్వరన్ - సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి పరిచయమై హీరోయిన్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న జీఎస్టీపై తాజాగా ఆల్ఫాన్సో పుత్రేన్ కు కొన్ని సందేహాలు వచ్చాయి. వాటిని సోషల్ మీడియా ద్వారా కోలీవుడ్ సీనియర్ హీరోలు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ల ముందుంచాడు. ‘‘సినిమా అండ్ గ్యాంబ్లింగ్ ను జీఎస్టీలో ఒకే కేటగిరిలో ఎందుకు చేర్చారు? సినిమా గ్యాంబ్లింగ్ ఏవిధంగా సమానం? గ్యాంబ్లింగ్ లో డైస్ వేసినంత తేలిగ్గా సినిమా పూర్తయిపోతుందా? ట్రిపుల్ ఏస్ లేదా పోకర్ ఆడటం లాంటిదా సినిమా తీయడమంటే? ఒక డైస్ వేయడానికో... పేకముక్కలు కలపడానికో వెచ్చించే సమయం... ఒక సినిమా తీయడానికి పట్టే సమయం ఒకటేనా?’’ ఇవే పుత్రేన్ డౌట్లు.

‘‘కమల్ హాసన్ - రజనీకాంత్ తమిళ సినిమాకు చెందిన అత్యంత గౌరవనీయులైన వ్యక్తులు. వీళ్లిద్దరూ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి బడ్జెటింగ్ లో జరిగిన ఎర్రర్ ను సరిచేయించాలని’’ పుత్రేన్ కోరారు. వాళ్లు ఈప్రయత్నం చేస్తే మొత్తం సినిమా పరిశ్రమను - ఆడియన్స్ ను కాపాడిన వారవుతారని ఒపీనియన్ షేర్ చేశాడు. పుత్రేన్ డౌట్లు ఆలోచించాల్సిన విధంగానే ఉన్నాయి. మరి దీనికి తమిళ పెద్దలిద్దరూ ఏమంటారో...