Begin typing your search above and press return to search.

తమిళ హీరోలు ఒప్పుకోకుంటేనే సందీప్‌తో

By:  Tupaki Desk   |   24 Jun 2015 7:00 PM IST
తమిళ హీరోలు ఒప్పుకోకుంటేనే సందీప్‌తో
X
సందీప్‌ కిషన్‌ కొత్త సినిమాకు 'టైగర్‌' అని టైటిల్‌ అనౌన్స్‌ చేసినపుడు జనాలకు మెంటలెక్కిపోయింది. హీరోగా మొదట్నుంచి లవర్‌బాయ్‌, సాఫ్ట్‌ క్యారెక్టర్లు చేస్తున్న సందీప్‌కు 'టైగర్‌' అనే టైటిల్‌ సూటవుతుందా? అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. తమిళ దర్శకుడు ఆనంద్‌ సందీప్‌తోనే ఇలాంటి మాస్‌ సినిమా ఎందుకు చేయాలనుకున్నాడబ్బా? అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఐతే వాస్తవానికి 'టైగర్‌' కథ సందీప్‌ను ఉద్దేశించి రాసుకున్నది కాదట. అసలీ సినిమాను తెలుగులో చేయాలనే అనుకోలేదట. మురుగదాస్‌ శిష్యుడి ఆలోచనలే వేరట. ఆ సంగతేంటో ఆనంద్‌ మాటల్లోనే విందాం పదండి.

''టైగర్‌ కథ రాసి మా గురువుగారు మురుగదాస్‌కు వినిపించా. ఆయనకు భలే నచ్చేసింది. వెంటనే ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ వాళ్లకు చెప్పి నిర్మాణానికి ఏర్పాట్లు చేశాడు. ఈ సినిమాను తమిళంలో తీద్దామనే అనుకున్నాం. జీవా, విజయ్‌ సేతుపతి లాంటి వాళ్లను అడిగాం. వాళ్లు అప్పటికి దొరకలేదు. సినిమా ఆలస్యమైపోతున్న సమయంలో అనుకోకుండా సందీప్‌ కిషన్‌ను కలిసి కథ చెప్పా. అతను ఠాగూర్‌ మధును కలిసే ఏర్పాటు చేశాడు. వాళ్లకు కథ నచ్చడంతో ఇలా తెలుగులో మొదలైందీ సినిమా. ఐతే నా ఆలోచనలకు ఏమాత్రం తగ్గకుండా నటించాడు సందీప్‌. అతడికీ సినిమా పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుంది'' అన్నాడు ఆనంద్‌.