Begin typing your search above and press return to search.

వర్మ స్క్రాప్.. ఆ బ్యూటీకి అనుకోని షాక్..!

By:  Tupaki Desk   |   8 Feb 2019 10:28 AM GMT
వర్మ స్క్రాప్.. ఆ బ్యూటీకి అనుకోని షాక్..!
X
'అర్జున్ రెడ్డి' అనేది మోడరన్ టాలీవుడ్ క్లాసిక్. అలాంటి సినిమాలు టాలీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లో అయినా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాను రీమేక్ చేసేందుకు పూనుకోవడం ఒకరకంగా సాహసమే అని చెప్పాలి. కానీ అలాంటి సినిమాను విక్రమ్ తనయుడు ధృవ్ కు లాంచ్ ప్యాడ్ గా ఎంచుకున్నారు. ఈ సినిమాను తమిళంలో 'వర్మ' పేరుతో బాలా దర్శకత్వంలో రీమేక్ చేశారు. సినిమా అవుట్ పుట్ చూసి.. ఇలా రిలీజ్ చేస్తే లాభం లేదనుకొని నిర్మాతలు స్క్రాప్ చేయాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం వెనక విక్రమ్ ఉన్నారని కోలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది. స్క్రాప్ చేసినందువల్ల జరిగే నష్టాన్ని భరించడానికి ముందుకు రావడంతోనే నిర్మాతలు దీనికి ఒప్పుకున్నారని అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం ధృవ్ కెరీర్ కు మంచిదేగానీ ఈ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఈ సినిమా స్క్రాప్ చేయడం వల్ల ఫస్ట్ స్ట్రోక్ డైరెక్టర్ బాలా కే. సినిమా పూర్తి అయన తర్వాత స్క్రాప్ చేయడమనేది అయనకు ఇన్సల్ట్ లాంటిదే. అసలే ఆయన తన కెరీర్లో ఫెయిల్యూర్ల తో సతమతమవుతున్నాడు. ఈ పరిణామం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు. ఇక డైరెక్టర్ తర్వాత ఇంపాక్ట్ పడేది. హీరోయిన్ మేఘ చౌదరిపై.

సినిమా రిలీజ్ అయితే ధృవ్ నటన.. బాలా దర్శకత్వం సంగతేమో కానీ మేఘకు కాస్తయినా గుర్తింపు వచ్చే అవకాశం ఉండేది. కారణం ఏంటంటే కౌంట్ లెస్ లిప్ లాక్స్. హాట్ హీరోయిన్లకు ఎప్పుడూ గ్లామర్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుంది కాబట్టి మేఘకు ఆఫర్లు వచ్చేవే. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా.. ఇప్పుడు 'వర్మ' ను స్క్రాప్ చేయడం మేఘకు నష్టమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.