Begin typing your search above and press return to search.
కొత్త వాళ్లలో వీళ్లిద్దరూ డిఫరెంట్ గురూ!
By: Tupaki Desk | 28 Aug 2022 9:44 AM GMTట్యాలెంట్ ఉంటే ఇండస్ర్టీ నెత్తిన పెట్టుకుంటుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో చాలా మంది కొత్త మేకర్స్ సక్సెస్ అయ్యారు. వారంతా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలకి ప్రమోట్ అవుతున్నారు. టైర్-2 హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అయిన వాళ్లంతా స్టార్ హీరోలు టార్గెట్ గా కథలు సిద్దం చేస్తున్నారు. ఒక్క సక్సెస్ తోనే `బింబిసార` దర్శకుడు విశిష్ట పై స్టార్ హీరోల దృష్టి పడిందంటే? సన్నివేశం ఎంతగా మారిందో అద్దం పడుతుంది.
అయితే ఇంత వరకూ ఎంత మంది దర్శకులొచ్చినా..టాలీవుడ్ లో ఆ ఇద్దరు మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నారు. వాళ్లే అనుదీప్ కె.వి..విమల్ కృష్ణ. `జాతిరత్నాలు `సక్సెస్ తో అనుదీప్ పేరు పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. డిఫరెంట్ కామెడీ జానర్ ని ట్రై చేసి సక్సెస్ అయిన దర్శకుడితను. స్ర్కిప్ట్ దశలోనే అతను సగం సక్సెస్ అయ్యాడు.
ఆ స్ర్కిప్ట్ పాత్రలకు నవీన్ ..రాహుల్ .. ప్రియదర్శి లాంటి నటులు ప్రాణం పోసారు. ఇలా ఈ రెండు పనుల్లో ఎలాంటి లోపం లేదు కాబట్టే జాతిరత్నాలు అంత పెద్ద సక్సెస్ అయింది. అనుదీప్ లో ఆ ప్రతిభను గుర్తించిన కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ వెంటనే అతనితో ప్రిన్స్ అనే సినిమా చేయడం మొదలు పెట్టాడు. ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకోవడంలో కోలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది.
ఇక `డీజే టిల్లు` సక్సెస్ తో యంగ్ మేకర్ విమల్ కృష్ణ పేరు అంతే మారుమ్రోగింది. ఇది డిఫరెంట్ కామెడీ జానర్ చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. అంతకు ముందు `నరుడి బ్రతుకు నటన` అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. డీజే టిల్లుతో అన్నింటిని బ్యాలెన్స్ చేసాడు. ఇద్దరి దర్శకుల్లో కామన్ గా కనిపించేది ట్రెండీ కామెడీని హైలైట్ చేయడమే.
అదే వీళ్లలో యూనిక్ క్వాలిటీగా చెప్పొచ్చు. నేడు ఇద్దరి పేర్లు టాలీవుడ్ లో మారుమ్రోగుతున్నాయంటే కారణం అదే. సీనియర్ దర్శకుల్ని సైతం మెప్పించిన నవతరం ప్రతిభావంతులు. సాధారణంగా సీనియర్ మేకర్స్ యంగ్ మేకర్స్ సినిమాలు చూడటం అన్నది చాలా రేర్. బ్లాక్ బస్టర్స్ అయితే తప్ప చూసే పరిస్థితి ఉండదు.
కానీ విమల్..అనుదీప్ విషయంలో వాళ్లంతా ఎంతో రియలైజేషన్ సైతం చూపిస్తున్నారు. తాము చేయలేనదిని.. తీయలేకపోతున్నాది ఆ యంగ్ మేకర్స్ ఇద్దరు చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఈ ఐదేళ్లలో చాలా మంది కొత్త వాళ్లు సక్సెస్ అయ్యారు. కానీ వీళ్లిద్దరు గురించి సీనియర్స్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారంటే? సమ్ థింగ్ స్పెషల్ గానే ఫోకస్ అవుతున్నారని చెప్పొచ్చు. వీళ్లిద్దరు గొప్ప హైట్స్ కి చేరతారనడానికి ఇంతకన్నా సూచిక ఇంకేముంటుంది.