Begin typing your search above and press return to search.
నవ్వుతూనే కష్టాలన్నీ చెప్పిన దర్శక 'రత్నం'
By: Tupaki Desk | 24 March 2021 2:30 AM GMTప్రస్తుతం థియేటర్స్ లో నవ్వులు పూయిస్తూ భారీగా వసూళ్ళు రాబడుతున్న సినిమా ''జాతిరత్నాలు''. నవీన్ పోలిశెట్టి - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై ఇన్ని రోజులవుతున్నా ఇంకా ఈ హాస్య రత్నాల సందడి కనిపిస్తూనే ఉంది. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. సినిమా కథ కథనం ఇలాంటి వన్నీ ఆలోచించకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ నవ్వుకొని ప్రేక్షకుడు బయటకు వస్తున్నాడు. ఈ నవ్వుల వెనుక వారిలో ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ ఒకరైతే.. డైరెక్టర్ అనుదీప్ కేవీ మరొకరు.
'పిట్టగోడ' అనే ప్లాప్ సినిమాతో ఇందులట్రీలో అడుగుపెట్టాడు అనుదీప్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేసినా అది ప్లాప్ అవడంతో అతన్ని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలో మరో అవకాశం రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అనుదీప్. 'జాతిరత్నాలు' సినిమాతో అందరూ తనను గుర్తు పెట్టుకునేలా తన గురించి మాట్లాడుకునేలా చేసాడు. దీంతో ఇప్పుడు నిర్మాతలందరూ అనుదీప్ కు అడ్వాన్సులివ్వడానికి పోటీ పడుతున్నారు. అయితే ఆడియన్స్ ని అంతలా నవ్వించిన ఈ దర్శక రత్నం జీవితంలో అనేక కష్టాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల అనుదీప్ ఫ్రెండ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాలు తెలిసాయి. సినిమాల మీద ఇష్టంతో చదువుని మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ నగరానికి వచ్చిన అనుదీప్ ఈ స్థాయికి రావడానికి అనేక కష్టాలు పడినట్లు తెలిపారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుదీప్.. నవ్వుతూనే తన జీవితంలో ఎలాంటి కష్టాలు పడ్డాడో వెల్లడించారు. కృష్ణానగర్ లో ఒక ఫ్రెండ్ రూమ్ లో లగేజ్ పెట్టి మరో ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాడినని.. లగేజేగా పెట్టింది నేను ఇక్కడ ఉండటం లేదు కదా అని ఒకరితో.. నా లగేజ్ ఏమీ లేకుండా ఒక్కడినే ఉంటున్నా కదా అని మరొకరితో చెప్తూ రెండు చోట్లా రెంట్ కట్టకుండా ఉండేవాడినని నవ్వుతూ చెప్పాడు. అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నా తనకు కష్టాలేమీ లేవని.. తన వల్ల ఫ్రెండ్స్ మాత్రం కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. సినిమా ఛాన్సుల కోసం తిరుగుతున్న సమయంలో తన ఫ్రెండ్ శ్రీకాంత్ ఎంతో సాయం చేశాడని.. అతడికి ఉద్యోగం రావడంతో తాను కుదురుకునే వరకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చాడని.. అందుకే అతడి మీద అభిమానంతోనే 'జాతిరత్నాలు' సినిమాలో హీరోకు శ్రీకాంత్ అనే పేరు పెట్టానని అనుదీప్ తెలిపాడు. అయితే కష్టాలన్నీ చెబుతూనే.. 'తనకు సినిమా కష్టాలేమీ లేవని.. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమీ వేయొద్దని' నవ్వుతూ చెప్పడం అనుదీప్ కే చెల్లింది.