Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన దర్శక 'రత్నం'

By:  Tupaki Desk   |   22 March 2021 2:30 AM GMT
ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన దర్శక రత్నం
X
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జాతి రత్నాలు' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కథ బలంగా లేకున్నా కూడా కథనం మరియు ఎంటర్ టైన్‌ మెంట్‌ తో సినిమాను సూపర్‌ హిట్‌ చేసుకోవచ్చు అంటూ నిరూపించిన దర్శకుడు అనుదీప్‌ తదుపరి సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈయన బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తో సినిమా ను చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు నిజం కాదని దర్శకుడు అనుదీప్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే తాను ఒక యాక్షన్‌ సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పిన అనుదీప్‌ తదుపరి సినిమా విషయంలో మరింత స్పష్టత ఇచ్చాడు.

తనను నమ్మి జాతిరత్నాలు సినిమా ఆఫర్‌ ను ఇచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్‌ లోనే తదుపరి సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. జాతి రత్నాలు సినిమా విడుదల అయిన తర్వాత చాలా మంది నిర్మాతల నుండి ఫోన్‌ వచ్చింది. వారంతా కూడా కంగ్రాట్స్‌ చెప్పి తమ బ్యానర్ లో సినిమాను చేయమని ఆఫర్‌ చేశారు. కాని తాను మాత్రం అశ్వినీదత్ గారి బ్యానర్‌ లోనే మళ్లీ చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అశ్వినీదత్ గారి బ్యానర్‌ లో చేయడం గౌరవంగా భావిస్తున్నాను అన్నాడు. ఇక తదుపరి సినిమాకు ఇంకా స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయలేదని కొన్ని కథలు ఉన్నాయి వాటిలో నుండి ఒకటి ఎంపిక చేసి తదుపరి సినిమా ప్లాన్‌ చేస్తాను అన్నట్లుగా అనుదీప్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అనుదీప్ తన తదుపరి సినిమా విషయమై క్లారిటీ ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్ పెట్టినట్లయ్యింది.