Begin typing your search above and press return to search.
కష్టకాలంలో మెంబర్స్ కి దర్శక సంఘం అండ
By: Tupaki Desk | 16 May 2021 5:20 AM GMTమెగాస్టార్ చిరంజీవి మొదటి వేవ్ సమయంలో సీసీసీ ప్రారంభించినపుడు యాక్టివ్ మెంబర్ గా సేవలందించారు ఎన్.శంకర్. దర్శకసంఘం అధ్యక్షునిగా ఉన్న ఆయన సినీ కార్మికులు సహా తమ సంఘానికి అవసరమైన సహాయసహకారాలు అందించారు. అయితే సెకండ్ వేవ్ సమయంలో ఏం చేస్తున్నారు? అన్నదానికి సరైన ప్రచారం కనిపించలేదు. అయితే మొదటి వేవ్ సమయంలో ప్రచారం అవసరమైంది. కానీ ఈసారి అలా ప్రచారంతో పని లేకుండా నిరంతర సేవల్లో ఉన్నామని ఎన్.శంకర్ తాజాగా వెల్లడించారు.
మొదటి వేవ్ సమయంలో తెలుగు సినిమా దర్శకసంఘం(TFDA)లో అవసరార్థులైన అందరు సభ్యులకు 5000 చొప్పున ఆర్థిక సహకారం అందించాం. మెగాస్టార్ ప్రారంభించిన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) తరపున మూడు సార్లు గ్రాసరీస్ ఇచ్చి ఆదుకున్నామని శంకర్ తెలిపారు.
సెకండ్ వేవ్ లో చాలా మంది డైరెక్టర్లు కోడైరెక్టర్లు అసిస్టెంట్లకు కోవిడ్ సోకింది. దర్శకసంఘంలో ఎవరికి కోవిడ్ వచ్చినా వెంటనే 10వేలు సహకారం అందిస్తున్నాం. సంఘం మర్గదర్శకత్వం ప్రకారం ఇది చేస్తున్నాం. అలాగే ఆస్పత్రి బిల్లులను అందించగానే వీలున్నంతవరకూ ఆర్థిక సాయాన్ని సంఘం తరపున చేస్తున్నాం. ఈ క్లిష్ఠ సమయంలో సభ్యులందరికీ మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సంఘంలో అందరికి వ్యాక్సినేషన్ పరంగానూ సహకారం చేస్తున్నాం. సంఘం తరపున ఇతరులకు సహాయానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరూ అధైర్య పడకుండా కరోనాపై పోరాటం సాగించాలి. ఇప్పటివరకూ కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.15 వేల నుంచి 1లక్ష వరకూ ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేశాం. వారి ఖర్చుల వివరాల్ని బట్టి సాయం చేశాం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు లక్ష ఆర్థిక విరాళం అందించాం. సాధ్యమైనంత ప్రయత్నం చేశాం.. అని తెలిపారు.