Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా డైరెక్టర్ కి ప్రమోషన్ వస్తుంది..!

By:  Tupaki Desk   |   16 Dec 2022 11:30 AM GMT
పాన్ ఇండియా డైరెక్టర్ కి ప్రమోషన్ వస్తుంది..!
X
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తన లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఇంతకీ అతను ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే.. అట్లీ అండ్ అతని వైఫ్ ప్రియ తల్లిదండ్రులు కాబోతున్నారట. ఈ విషయాన్నే అట్లీ తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు.

అట్లీ సూపర్ ఫాం లో ఉన్నారు. కోలీవుడ్ లో దళపతి విజయ్ తో వరుస సినిమాలు తీసి హిట్ అందుకున్న అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సౌత్ డైరెక్టర్ తో షారుఖ్ చేస్తున్న జవాన్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. అయితే లేటెస్ట్ గా తను తండ్రి కాబోతున్న విషయాన్ని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు డైరెక్టర్ అట్లీ. 2014 లో కృష్ణ ప్రియని పెళ్లి చేసుకున్నారు అట్లీ.

అయితే కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇన్నాళ్లు మాపై మీరు ఉంచిన ప్రేమకి ధన్యవాదాలు అంటూ అట్లీ అండ్ ప్రియ తమ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ పోస్ట్ చేశారు.

అట్లీ, ప్రియ లది లవ్ మ్యారేజ్. అట్లీ లోని టాలెంట్ చూసి నచ్చిన ప్రియ అతను ప్రపోజ్ చేయగానే వెంటనే ఓకే చెప్పింది. ప్రియ తెలుగు లో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. డైరెక్టర్ అట్లీ భార్య అయ్యాక ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. అట్లీ తన పర్సనల్ లైఫ్ లో తండ్రిగా ప్రమోషన్ కొట్టేస్తున్నాడు. జవాన్ రిలీజ్ టైం కి తన ఇంట్లో ఒక బిడ్డ వచ్చేస్తుందని చెప్పొచ్చు.

తండ్రి అవడం అన్నది ఒక అద్భుతమైన అనుభూతి ప్రస్తుతం అట్లీ ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తన మంచి కోరుకునే వారికి ఈ విషయాన్ని చెప్పి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు. మరి ఈ సంతోషంతో జవాన్ మీద మరింత ఫోకస్ పెట్టి సినిమాని నెక్స్ట్ లెవల్ లో తెరకెక్కిస్తారని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.