Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడు ప్రేక్షకులకు రిటార్ట్ ఇస్తున్నాడా?
By: Tupaki Desk | 5 Aug 2018 6:14 AM GMTకొన్నిసార్లు కొన్ని మంచి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. వాటిని ప్రేక్షకులు పట్టించుకోరు. ఇంత కష్టపడి మంచి సినిమా తీసినా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదే అన్న బాధ ఫిలిం మేకర్లలో ఉంటుంది. ఆ అసహనంలో కొందరు రూటు మార్చి ప్రేక్షకుల బలహీనతల మీద కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి అనే దర్శకుడు అదే పని చేస్తున్నట్లున్నాడు. ఈయన దర్శకత్వంలో ఇంతకుముందు ‘మిణుగురులు’ అనే మంచి సినిమా వచ్చింది. ఆ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అవార్డులూ వచ్చాయి. అందరూ మంచి సినిమా మంచి సినిమా అన్నారు. కానీ అది ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. పెట్టుబడి వెనక్కి రాలేదు. చిత్ర బృందానికి నిరాశ తప్పలేదు.
ఐతే ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో రుజువు చేసుకున్న అయోధ్య కుమార్ ఇప్పుడు తొలి సినిమాకు పూర్తి భిన్నమైన చిత్రంతో తయారయ్యాడు. అతడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘24 కిసెస్’. తొలి సినిమాలో అంధుల బాధల్ని హృద్యంగా చూపిస్తూ.. మంచి సందేశం ఇచ్చిన అయోధ్యకుమార్ ఈసారి యూత్ ను టార్గెట్ చేస్తూ రొమాంటిక్ మూవీ తీశాడు. ఈ టీజర్ చూస్తే ‘అర్జున్ రెడ్డి’.. ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సినిమాల స్ఫూర్తి కనిపిస్తోంది. పేరుకు తగ్గట్లే ఇందులో ముద్దుల మోత మోగించేశారు. కుర్రకారును రెచ్చగొట్టేలా ఉంది టీజర్. మంచి సినిమా తీస్తే చూడరా.. ఇప్పుడు చూడండి అంటూ ప్రేక్షకులకు రిటార్ట్ ఇస్తున్నట్లుగా ఉంది అయోధ్య కుమార్. సినిమాలో కళాత్మకత కంటే యూత్ ను రెచ్చగొట్టి ‘ఆర్ ఎక్స్ 100’ తరహాలో క్యాష్ చేసుకోవాలన్న ప్రయత్నమే కనిపిస్తోంది. ‘మిణుగురులు’ లాంటి సినిమా తీసిన దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.