Begin typing your search above and press return to search.
లిప్ లాక్ - బెడ్ రూమ్ సీన్స్ లేవ్!
By: Tupaki Desk | 27 Nov 2018 8:23 AM GMTనా సినిమాలో వల్గారిటీ లేదు మొర్రో! అశ్లీలం ఉంది అని ఎందుకు ప్రచారం సాగిందో అర్థం కాలేదంటూ వాపోతున్నారు `24 కిస్సెస్` దర్శకుడు అయోధ్య కుమార్. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ లో డిబేట్ పేరుతో జరిగిన చెడు ప్రచారం ఇబ్బంది పెట్టిందని ఆయన ఫ్రెండు మీడియా వేదికగా చెప్పడం చర్చకొచ్చింది. ఒక ముద్దు సీను లేదు. కనీసం బెడ్ రూమ్ సన్నివేశం లేదు. నగ్నత్వం లేనేలేదు. ఒకే ఒక్క ముద్దు సీన్ .. అదీ ఎంతో పోయెటిక్ గా చూపించాం అంతే. అయినా ఇందులో అశ్లీలత - అసభ్యత పెచ్చుమీరి ఉందంటూ ప్రచారం చేశారని దర్శకుడు వాపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మాపై ఆ నెగెటివ్ పబ్లిసిటీ ముందే చేసేయడం సినిమాపై ప్రభావం చూపిందని అన్నారు. సమీక్షకులు చెప్పిన ప్రతి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశామని అన్నారు.
ఒక చైల్డ్ యాక్టివిస్ట్, ఎన్జీవోకి ఎఫైర్స్ ఉండకూడదు! అన్న సందేశాన్ని చూపించాలనుకున్నాం. ఇందులో మల్టిపుల్ నేరేషన్ కథని తెరపై చూపించాం. క్లాసికల్ లవ్ స్టోరిని చూపించాం. ఇది టీవీ - అమెజాన్ లో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది.. అని దర్శకుడు అయోధ్య అన్నారు. ఈ సినిమాకి నైజాంలో దర్శకుడే సొంతంగా రిలీజ్ చేశారు. ఇప్పటికే 74లక్షల వసూళ్లు దక్కాయని ఇందులో నటించిన సీనియర్ నరేష్ చెప్పారు. అయితే దర్శకుని స్నేహితుడు - ఇందులో ఓ చిన్న పాత్రలో నటించిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ చిత్రంలో చక్కని సందేశం చూపించాలని అనుకున్నాం. కానీ ముద్దులపై ప్రచారం డామినేట్ చేసేయడం కొంత తేడా ప్రభావం చూపించిందని అన్నారు. సినిమాని థియేటర్లలో ఆదరించండి అని టీమ్ అభ్యర్థించింది.
మొత్తానికి ఒక్కోసారి టైటిల్ లో నెగెటివిటీ - మీడియాలో అనవసర పబ్లిసిటీ ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుందో చెప్పేందుకు ఇదో ఎగ్జాంపుల్. టైటిల్ చూసి ఇలాంటి సినిమాకి వెళతామా? అని ఫ్యామిలీ ఆడియెన్ అనుకున్నా చిక్కులొస్తాయి. ఇక మల్టిపుల్ నేరేషన్ లో ఏది తేడా కొట్టినా ఇంతే ఫలితం ఉంటుందని వాళ్లకు వాళ్లే మీడియాకి చెప్పడం చర్చకొచ్చింది. అయితే చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని - అనవసర సన్నివేశాల్ని తీసేసి.. తిరిగి ఆ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని అనడం ఇక్కడ కొసమెరుపు.