Begin typing your search above and press return to search.

చిరు రాజ‌కీయాల‌కు ప‌నికిరారన్న డైరెక్ట‌ర్ బాబి

By:  Tupaki Desk   |   9 Jan 2023 3:45 AM GMT
చిరు రాజ‌కీయాల‌కు ప‌నికిరారన్న డైరెక్ట‌ర్ బాబి
X
చిరు రాజ‌కీయాల నుంచి వైదొలిగాక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా 'జ‌న‌సేన' పార్టీని స్థాపించి ముందుకు న‌డిపిస్తున్నారు. పోటీబ‌రిలో క‌రుడుగ‌ట్టిన నాయ‌కులు ఉన్నా నువ్వా నేనా? అంటూ పోటీకి దిగుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా జ‌న‌సేనాని ప్ర‌ణాళిక‌ల‌ను విస్త‌రిస్తున్నారు. ఓ వైపు జీవ‌నం బ‌తుకు తెరువు కోసం సినిమాలు చేస్తూనే తాను రాజ‌కీయాల్లో ఈదుతాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ తాను చెప్పిందే చేస్తున్నారు.

అందుకే ఈ ఆదివారం సాయంత్రం 'వాల్తేరు వీర‌య్య' ఈవెంట్లో దానిని ప్ర‌స్థావిస్తూ ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌కుడు బాబి ప‌వ‌ర్ స్టార్ ని ఆకాశానికెత్తేసారు. త‌న స్పీచ్ లో ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎదుగుతార‌న్న న‌మ్మ‌కం వ్య‌క్త‌మైంది. అత‌డి ప‌వ‌రు పొగ‌రు గురించి బాబి గ‌ట్టిగానే మాట్లాడ‌టం మెగాభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మీకు దేవుడు త‌మ్ముడినిచ్చాడు.. అత‌డు చూస్కుంటాడు...అత‌డు స‌మాధానం చెబుతాడు. గ‌ట్టిగా మాట్లాడ‌తాడు. మీలోంచి వ‌చ్చిన మంచిత‌నం ఆవేశం క‌లిస్తే ప‌వ‌ర్ స్టార్..! అంటూ బాబి ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇవ్వ‌డం ప‌వ‌ర్ స్టార్ అభిమానుల్లో ర‌చ్చ‌గా మారింది. వేదిక వ‌ద్దకు తండోప‌తండాలుగా విచ్చేసిన మెగాభిమానులు ప‌వ‌ర్ స్టార్ అభిమానులు బోలెడంత ర‌చ్చ చేశారు. జై జ‌న‌సేనాని అంటూ నినాదాలు ఏయు గ్రౌండ్స్ లో వినిపించాయి. ఇవ‌న్నీ ప‌వ‌న్ కి పెరుగుతున్న పొలిటిక‌ల్ గ్రాఫ్‌ ఇమేజ్ ని సూచించాయి.

ఇదే వేదిక‌పై మెగా బ్ర‌ద‌ర్స్ మంచిత‌నం గురించి బాబి ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ''ఎందుకు మెగాస్టార్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్ కి కోపం రాదు?''.. ఎవ‌రు ఏది అన్నా ఆయ‌న బాధ‌ప‌డ‌తారే కానీ ఎవ‌రినీ బాధ‌పెట్ట‌రు! అని బాబి అన్నారు. అవ‌త‌లోడు అన్నాడు క‌దా అని మ‌నం అనేస్తే వారికి త‌ల్లిదండ్రులు భార్యా పిల్ల‌లు ఉంటారు.. చెల్లెలు ఉంటుంది.. వారంత బాధ‌ప‌డ‌తార‌ని చిరు ఒక లైన్ చెప్పారు. దానికి హ్యాట్సాఫ్‌. ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ ఒక్క‌డే.. అది మీరు మాత్ర‌మేన‌ని త‌న అభిమానాన్ని బాబి చాటుకున్నాడు. చిరు లాంటి సున్నిత మ‌నస్కుడు రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని కూడా బాబి అన్నారు. నిజానికి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు మెగాస్టార్ ని అన‌ని నోరు లేదు.

ఒక సెక్ష‌న్ మీడియా.. ప్ర‌త్య‌ర్థులు ఇష్టానుసారం చిరును టార్గెట్ చేశారు. బ్ల‌డ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ స‌హా సామాజిక కార్య‌క్ర‌మాల‌ను టార్గెట్ చేస్తూ చిరును- ప‌వ‌న్ ని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ హింసించిన ప్ర‌త్య‌ర్థి నాయ‌కులున్నారు. చిరు సున్నిత మ‌న‌స్కుడు కావ‌డంతో ప్ర‌త్య‌ర్థికి సులువుగా టార్గెట్ అయిపోయారు. కానీ ఎక్క‌డా ఆయ‌న తొణికిస‌లాడ‌లేదు. హుందాగా త‌న‌కు సూట్ కాని రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని తిరిగి త‌న అభిమానుల కోసం సినిమాల్లోకి వ‌చ్చారు. స్టార్ గా తిరిగి త‌న గ్రాఫ్ ఎక్క‌డా త‌గ్గ‌ద‌ని నిరూపించారు. 60 ప్ల‌స్ వ‌య‌సులో ఇప్ప‌టికీ టాలీవుడ్ ని రారాజుగా ఏల్తున్నారు.

ఇక రాజ‌కీయాలను ప‌వ‌న్ విర‌మించ‌రు. అవిశ్రామంగా అత‌డి పోరు సాగుతుంద‌ని కూడా బాబి అన్న మాట‌ల్లో ధ్వ‌నించింది. చిరు ఎదుటే కూచుని ఉన్న వేదిక పై బాబి ఆవేశంగా మాట్లాడారు. ''దేవుడు మీకు ఒక త‌మ్ముడినిచ్చాడు... అత‌డు గ‌ట్టిగా మాట్లాడ‌తాడు. మాట‌కు మాట ..క‌త్తికి క‌త్తి .. పొగ‌రుకి పొగ‌రు ప‌వ‌ర్ స్టార్. నేను మీతో ప‌ని చేశాను. మీకంటే ముందు ప‌వ‌ర్ స్టార్ తో ప‌ని చేసాను. అదే మంచిత‌నం అదే తెగువ అంటూ'' బాబి అన్న‌య్య ముందే త‌మ్ముడు ప‌వ‌న్ పై ప్రశంస‌లు కురిపించారు. ఈ ఎపిసోడ్ ఆద్యంతం వీక్షిస్తున్న ఆడియెన్ కి గూస్ బంప్స్ తెప్పించిందంటే అతిశ‌యోక్తి కాదు. మెగా బ్ర‌ద‌ర్స్ మంచిత‌నం విలువ‌లు ఒదిగి ఉండే స్వ‌భావం గురించి బాబి తాను చూసిన‌ది చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. ఇది సినిమాటిక్ అవుతుందేమో! అంటూ కూడా బాబి ఎంతో స్వ‌రం త‌గ్గించి కాన్ఫిడెంట్ స్పీచ్ తో ఆక‌ట్టుకున్నారు. వీర‌య్య వేదిక‌పై ఎక్క‌డా అతిశ‌యోక్తులు అనేవి క‌నిపించ‌లేదు. హుందా అయిన భాష‌తో చిరంజీవి- బాబి- ర‌వితేజ ఆక‌ట్టుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.