Begin typing your search above and press return to search.
చిరంజీవిని డైరెక్ట్ చేశాను.. ఇంతకంటే ఏం కావాలి?
By: Tupaki Desk | 9 Jan 2023 3:58 AM GMT'వాల్తేరు వీరయ్య' లాంటి మాస్ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు డైరెక్టర్ బాబి. రవితేజ పవర్ తో ఛాన్సిచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ లాంటి హిట్ సినిమా చేశారు. చిరు అభిమానిగా అతడు ప్రేమించి ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' సినిమా తీస్తున్నానని ముందే ప్రకటించాడు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ లో మెగా బాస్ కోసం బాబి శ్రమించి పని చేశాడు. అందుకే బాబి పనితనాన్ని ప్రశంసించిన చిరు తనను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని చిరంజీవి స్వయంగా ప్రీరిలీజ్ వేదికపై ప్రశంసించారు. తన నమ్మకాన్ని బాబి ఎప్పుడూ వమ్ము చేయలేదని కీర్తించారు.
ఇక బాబి లైఫ్ జర్నీ సినీజీవితంలో నలుగురు వ్యక్తులు కీలకమని అతడి స్పీచ్ ని బట్టి అర్థమైంది. తొలిగా గుంటూరు నుంచి తాను సినీ పరిశ్రమకు రావడానికి కారణం తన తండ్రి గారేనని తెలిపారు. సినిమా అనే పిచ్చిని నాన్నగారు చిన్నప్పటి నుంచే నూరి పోసారని...ఇంద్ర సినిమా టైమ్ లో హైదరాబాద్ వచ్చి రచయిత చిన్ని కృష్ణ వద్ద అసిస్టెంట్ గా చేరానని తెలిపారు. 2003 నుంచి 2023 వరకూ పరిశ్రమలో జర్నీ సాగింది.
ఇలా చెప్పడం సినిమాటిక్ అవుతుందేమో.. 39 ఏళ్లు వచ్చేసరికి మెగాస్టార్ డైరెక్టర్ ని అయ్యాను.. గూగుల్ లో నాకంటూ కొన్ని పేజీలొచ్చాయి. ఐ లవ్ యు..! అంటూ ఎమోషనల్ అయ్యారు బాబి. అంతేకాదు.. తాను ఈ సినిమా చేసేప్పుడు తన తండ్రి గారు అనారోగ్యంతో మరణించిన (ఆగస్టు 2022) విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను సినిమా తీస్తున్నప్పుడు నాన్నగారికి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పినట్టు బాబి గుర్తు చేసుకున్నారు.
కానీ తాను దర్శకుడిగా పని ఆపేస్తానని నాన్న బాధపడేవారని కూడా తెలిపారు. కానీ నాన్న పోయాక మూడవ రోజు నుంచే షూటింగ్ మొదలెట్టి 94 రోజులు నాన్ స్టాప్ గా పని చేసాను. ఇంట్లో కూచుంటే నా వెనుకే ఉండి షూటింగ్ చేయ్ అని నాన్న అంటున్నట్టుగా ఉండేది. తన ప్రోద్బలంతోనే నేను దర్శకుడినయ్యాను అని తెలిపారు. సినిమాలకు నాన్నగారు కరుడుగట్టిన ఫ్యాన్ అని కూడా బాబి తెలిపారు.
2003లో ఇంద్ర సమయంలో పరిశ్రమకు వచ్చాను..2023లో అన్నయ్యతో 39 ఏళ్ల వయసులో సినిమా చేశాను.. అని బాబి ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు. చిన్నికృష్ణ- కోనవెంకట్ ఇద్దరూ నా గురువులు అని కూడా బాబి తలచుకున్నారు.
సినిమా ప్రివ్యూ చూశాక ఏమంటారో చిరంజీవి గారు అనుకున్నాను.. 'తమ్ముడూ అద్భుతంగా తీశావ్!' అన్న ఒక మాట అన్నారు.. అది చాలు.. అంతకంటే ఏం కావాలి! అని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవిని డైరెక్ట్ చేశాను.. ఇంతకంటే ఏం కావాలి? అని కూడా యంగ్ డైరెక్టర్ బాబి ఆనందం వ్యక్తం చేసారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.