Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ : వెంకీ మామ డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర(బాబీ) తో స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 9 Dec 2019 1:38 PM GMTస్టార్స్ తో సినిమాలు తీయాలంటే డైరెక్టర్స్ కి చుక్కలు కనిపిస్తాయి అలాంటిది ముల్టీ స్టారర్లు తీయడం - ఒకే స్టార్ ని మూడు రకాలుగా చూపించడడం తదితర విన్యాసాలు అవలీలగా చేసేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. వెంకటేష్ - నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన వెంకీ మామ డిసెంబర్ 13 న రిలీజ్ అవ్వబోతుంది - ఈ సందర్భంగా వెంకీ మామ డైరెక్టర్ బాబీ తో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్.
* రవితేజ గారిని మినహాయిస్తే నట వారసులతోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు - ఎందుకో తెలుసుకోవచ్చా ?
షాక్ లుక్ ఇచ్చి ఆ తరువాత కొంత సేపు అలోచించి... నిజమే అండి మీరు ఈ క్వశ్చన్ అడిగే వరకు నాకు కూడా తట్టలేదు ఈ విషయం - ఆలోచిస్తే నిజమే గా అనిపిస్తుంది. రవితేజ గారిని పక్కన పెడితే - పవన్ కళ్యాణ్ గారు - వెంకటేష్ గారు - జూనియర్ ఎన్టీఆర్ గారు - చైతు గారు ఇలా నేను నా మొదటి సినిమా తరువాత నేను పని చేసిన హీరోలంతా నట వారసులే - ఏదో ఇలా కుదిరేసింది కానీ ఇదంతా నేను ప్లాన్ చేసుకున్నది కాదు. చెప్పాలంటే ఇది నా అదృష్టం అనుకోవాలి.
* వరుస పెట్టి సినిమాలు అన్ని స్టార్స్ తోనే చేస్తున్నారు - ఇది కూడా ఏదో మీ అదృష్టం వల్ల కుదిరేసింది అని మాత్రం చెప్పకండి?
టాలెంట్ తో పాటు లక్ అండ్ టైమింగ్ కూడా ఇండస్ట్రీ లో చాల ఇంపార్టెంట్ - నేను రైటర్ గా స్టోరీస్ రాసుకునే టైం దగ్గర నుంచి ఇప్పుడు ఇలా సినిమాలు చేయడం వరకు ఏది అనుకోని చేసింది కాదు - నేను కొత్త వాడిని అయినా నా కథ పై నా టాలెంట్ పై నమ్మకం తో రవితేజ గారు అవకాశం ఇచ్చారు. ఆ గోల్డెన్ ఛాన్స్ నేను సరిగా ఉపయోగించుకోవడం వల్లే ఆ తరువాత పవన్ గారు కానీ - ఎన్టీఆర్ గారు కానీ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వెంకీ మామ విషయం కూడా అంతే - నాకు సంబంధించినంత వరకు కథే స్టార్.
* సరే మీరు అన్నట్లు గా కథే స్టార్ అనుకుందాం - మరి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ - కొత్త వాళ్లతో ఇప్పుడు సినిమా చేయడానికి మీరు రెడీ గా ఉన్నారా?
నేను సినిమాలు చేయడానికి ఎల్లప్పుడు రెడీ - అందులో కొత్తవాళ్లు - పాతవాళ్ళు అనే తేడా లేదు నాకు - నేను రవితేజ తో సినిమా చేయడానికి ముందు కొత్త వాడినే కదా - ఏ నమ్మకం తో నాకు రవితేజ గారు ఛాన్స్ ఇచ్చారు. ఇవ్వని ఆలోచిస్తే నేను కూడా కొత్త వాళ్ళతో సినిమా చేయడం కరెక్ట్ కదా..!
* వెంకటేష్ ని వెంకీ మామ గా మార్చడం వెనుక రహస్యం ?
నిజానికి ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు - చైతు.. వెంకటేష్ గారిని వెంకీ మామ అని పిలుస్తాడట - మేము ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకుంటున్న టైం లో ఎవరో ఈ విషయం చెప్పారు - ఎలాగూ మా సినిమా కూడా మామ అల్లుళ్ల కథే కనుక - నిజంగా కూడా వెంకటేష్ గారు - చైతన్య మామ అల్లులే కనుక వెంకీ మామ టైటిల్ ని ఫిక్స్ చేసాము.
* వెంకీ మామ కోసం మాత్రమే ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది?
నిజానికి నేను నా ప్రతి సినిమా సినిమాకి మధ్య కొంత గ్యాప్ ఐతే వచ్చింది - కానీ వెంకీ మామ కి ఇంకా ఎక్కువ వచ్చింది. అలా వైకుంఠపురం టీజర్ లో బన్నీ గారు చెప్పినట్లు గా గ్యాప్ వచ్చింది - నేను ఇవ్వలేదు(నవ్వులు).
* అంటే మీ నెక్స్ట్ సినిమా బన్నీ గారితో చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా?
(షాక్... ) బన్నీ గారితో సినిమా చేయాలనీ నాకు ఉంది కానీ అయన డేట్స్ దొరకాలి - కథ సెట్ అవ్వాలి - ఇలా చాలా ఉంటాయి కదా - ఇప్పుడు మాత్రం వెంకీ మామ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో - మీ తుపాకీ డాట్ కామ్ లో ఎంత రేటింగ్ ఇస్తారో అనే టెన్షన్ ఉంది.
* మీ టెన్షన్ వెంకీ మామ కి వచ్చే హిట్ టాక్ తో పోవాలని - మీరు మరిన్ని హిట్ సినిమాలు తీయాలని మా తుపాకీ డాట్ కామ్ కోరుకుంటుంది - అల్ ది బెస్ట్
థాంక్ యు వెరీ మచ్ - తుపాకీ డాట్ కామ్ రీడర్స్ మా వెంకీ మామ సినిమా థియేటర్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను.