Begin typing your search above and press return to search.
బాబీ సత్తా తెలిసేది ఈ సినిమాతోనే!
By: Tupaki Desk | 10 Dec 2016 5:30 PM GMTపరాజయం తర్వాత కూడా బాబీకి ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఆయన కెపాసిటీ గురించి తెలిసినవాళ్లు మాత్రం బాబీ అందుకు అర్హుడే అని మాట్లాడుతున్నారు. వినాయక్ దగ్గర పలు సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు బాబీ. మాస్ అంశాలపై ఆయనకి పట్టుందని చెబుతుంటారు.
రవితేజతో తీసిన తొలి చిత్రం `పవర్`తోనూ అదే విషయం నిజమైంది. అందుకే తన రెండో చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌తో చేసే అవకాశాన్ని అందుకున్నాడు. `సర్దార్ గబ్బర్‌సింగ్` తర్వాత బాబీ ఎక్కడికో వెళ్లిపోతాడని ఊహించారంతా. కానీ ఆ చిత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ పరాజయాన్ని చవిచూసింది. దాంతో బాబీ కెరీర్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లింది. మంచి మాస్ దర్శకుడిగా ఎదుగుతాడని ఊహిస్తే బాబీ రెండో సినిమాకే ఇంటిదారి పట్టేశాడేంటి అనుకొన్నాంతా. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం బాబీపై నమ్మకం కోల్పోలేదు. `సర్దార్ గబ్బర్‌సింగ్` కథ బాబీది కాకపోవడం, దానికితోడు పవన్ సినిమా అంటే ఆయన ప్రమేయం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి బాబీ శక్తిసామర్థ్యాల్ని ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. సర్దార్ గబ్బర్‌సింగ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా ఇండస్ట్రీ వర్గాలు బాబీకి మరో అవకాశం ఇచ్చి చూడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. బాబీపై ఉన్న ఆ నమ్మకంవల్లే ఇప్పుడు ఆయనకి ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అందులో నిజం ఉంది కూడా.
అయితే బాబీ సత్తాకి ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఓ అగ్నిపరీక్ష అని చెప్పొచ్చు. ఈ సినిమాతో బాబీ హిట్టు కొట్టాడంటే ఇండస్ట్రీలో ఓ మాస్ దర్శకుడిగా ఆయన స్థానం పదిలమవుతుంది, ఒకవేళ ఫెయిల్యూరే ఎదురైందంటే ఇక ఆయనకి మరో అవకాశం రావడం కూడా కష్టమే. మరి బాబీ ఈ అగ్నిపరీక్షని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.