Begin typing your search above and press return to search.
వాల్తేరు వీరయ్య టైటిల్ కహాని ఇదా? బాబి!
By: Tupaki Desk | 8 Jan 2023 2:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `వాల్తేరు వీరయ్య` అన్నిపనులు పూర్తి చేసుకుని జనవరి 13న బాక్సాఫీస్ బరిలోకి దిగుతోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పోస్టర్లు.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాఖపట్టణం వాల్తేరు నేపథ్యంలో సాగే ఊర మాస్ కథ కావడంతో? మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ అని ముందే క్లారిటీ వచ్చేసింది.
`రిక్షావోడు`..`ముఠామేస్ర్తి` తరహాలో మాస్ చిరంజీవిని తెరపై చూడబోతున్నాం. దర్శకుడు బాబి ఓ డైహార్డ్ అభిమానిగా మారిపోయి తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా ఈసినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ట్ రివీల్ చేసారు. ముఖ్యంగా బాబి రివీల్ చేసిన టైటిల్ కహాని ఆసక్తికరంగా ఉంది. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
`యాగంటిలో `వెంకీ మామ` షూటింగ్ చేస్తున్నాం. దక్షిణాఫ్రికా నుండి నాజర్ గారి స్నేహితుడు వచ్చి నాకు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు సంబంధించిన పుస్తకంలో నాకు వీరయ్య అనే తెలుగు పదం పేరుతో దొరికింది. దీంతో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అదీ ఆ పేరు గుడిలో వచ్చింది. అప్పటికే మనసులో ఆ పేరుతో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
ఆ తర్వాత ఒక అభిమాని నాకు ఒక వీడియో పంపాడు. అందులో చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు వీరయ్య అనే వ్యక్తి తనకు సహాయం చేశారని చెప్పారు. దీంతో ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య తప్ప మరో టైటిల్ ఊహించుకోలేకపోయాను. మరో ఆలోచన లేకుండా ఆ టైటిల్ ఫిక్స్ చేసాను. ఈ విషయాలన్ని చిరంజీవి గారికి చెప్పాను. ఆయన ఇంకేమి ఆలోచించకు అని ప్రోత్సహించారు ` అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..`మొదట్లో ఓ అభిమానిగానే కథ రాశాను. కానీ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ప్రపంచ వరల్డ్ సినిమాకి కనెక్ట్ అవుతున్నారని గ్రహించాను. ఒక ఆటోవాలా కథ కూడా ఓటీలో మంచి కంటెంట్ అవుతుంది. వాటికి ఆదరణ బాగుంటుంది. ఆ తర్వాత ఇదే కథపై రీవర్క్ చేసి డెవలప్ చేశాను. రవితేజ పాత్ర కూడా ఇదే తరహాలో కథలోకి వచ్చింది. ఆరకంగా వీరయ్యకి సోదరుడు కుదిరాడు. ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ అవుతుందని పక్కాగా చెబుతాను. అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు దట్టంగా దట్టించాం` అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.