Begin typing your search above and press return to search.

గ‌రిక‌పాటిపై డైరెక్ట‌ర్ బాబి నిశ్శ‌బ్ద విస్ఫోట‌నం!

By:  Tupaki Desk   |   9 Oct 2022 4:38 AM GMT
గ‌రిక‌పాటిపై డైరెక్ట‌ర్  బాబి నిశ్శ‌బ్ద విస్ఫోట‌నం!
X
అవ‌ధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహ‌రావు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ఎంత‌టి దుమారాన్ని నరేపోయా తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేక్ష‌కాభిమానులు ఒక్కసారిగా గ‌రిక‌పాటిపై భ‌గ్గుమ‌న్నారు. త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు..దూష‌ణ‌ల‌కు దిగారు. ఇక అభిమాన సంఘాల అధ్య‌క్ష‌లు నేరుగా గ‌రికపాటికే ఫోన్ చేసి మాట్లాడ‌టం.. వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర‌డం వంటివి జ‌రిగాయి.

వాటికి గ‌రిక‌పాటి అంతే స‌మ‌య‌మ‌నంతో స్పందించ‌డంతో వివాదం కాస్త చ‌ల్లారింది. మ‌రికొంత మంది అభిమానులు గ‌రిక‌పాటిని ఉద్దేశించి స‌హ‌నం కోల్పోయిన తీరు సోష‌ల్ మీడ‌వియాలో చూసాం. తాజాగా నిన్న‌టిరోజున జ‌రిగిన `గాడ్ ఫాద‌ర్` స‌క్సెస్ మీట్ లోనూ గ‌రిక‌పాటి అంశం చ‌ర్చ‌కొచ్చింది. వేడుక‌కు వ‌చ్చిన వారంతా గ‌రిక పాటిని గుర్తు చేసుకున్నారు.

వేదిక‌పై మాట్లాడ‌డానికి వ‌చ్చిన వ‌క్తలంతా గ‌రిక‌పాటి ఎపిసోడ్ పై స్పందించే ప్ర‌య‌త్నం చేసారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు బాబి త‌న‌దైన శైలిలో స్పందించారు. `చిరంజీవి గారు ఆమ‌ద్య నిశ్శ‌బ్ద విస్పోట‌నం అన్నారు. ఆ మాట విలువ రెండ్రోజుల క్రిత‌మే తెలిసింది. ఎవడు ప‌డితే వాడు.. చిరంజీవిగారికి స‌రిసాటి రానివాడు కూడా.. త‌న ప‌ని తాను చేసుకొంటూ.. ఆ క్ష‌ణం అలా అవుతున్నా.. త‌న ప‌నికి వెళ్తున్నారు చూశారా.. అదీ చిరంజీవి అంటే. ఎలాంటి వారినైనా క్ష‌మించే గుణం ఆయ‌న‌ది. ఆయ‌న ముఖంలో ఎప్పుడూ చిరున‌వ్వే క‌నిపిస్తుంది. ఆ చిరున‌వ్వులో త‌న‌ని విమ‌ర్శించిన వాళ్లు క‌నిపిస్తారు` అంటూ గ‌రిక‌పాటి ఎపిసోడ్‌ని గుర్తుకు తెచ్చారు.

అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ ఛోటా కె.నాయుడు ఈ వివాదంపై కాస్త ఘాటుగానే స్పందించారు. `దేశంలో ఎంత‌మంది స్టార్లున్నా.. మెగాస్టార్ ముందు స‌రిపోరు. ఈమ‌ధ్య ఓ బుల్లి ఇన్సిడెంట్ జ‌రిగింది. ఆ డెవ‌డో ఫొటోలు తీసుకొంటామండి. ఆయ‌నపై అభిమానంతో తీసుకొంటాం. మాట్లాడేవాడు మ‌హా పండితుడు. ఆయ‌న అలా మాట్లాడొచ్చా అండీ.

అది త‌ప్పు క‌దా. అలాంటి వాడ్ని కూడా చిరంజీవి గారు ఇంటికి ఆహ్వానిస్తానంటే.. ఇది క‌దా సంస్కారం.. ఇది క‌దా నేర్చుకోవాల్సింది.. అనిపించింది. ఆయ‌న్నుంచి ఇదే నేర్చుకొంటాం కూడా` అంటూ త‌న‌దైన శైలిలో స్పందించారు. మెగా బ్రద‌ర్ నాగ‌బాబు `అసూయ` అంటూ సెటైర్లు వేసారు. మొత్తానికి గ‌రికపాటి వ్యాఖ్య‌లు ఇండ‌స్ర్టీలోనూ కాక రేపాయి.