Begin typing your search above and press return to search.

అన్ నేచురల్ కాదంటున్న చందు

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:03 AM GMT
అన్ నేచురల్ కాదంటున్న చందు
X
ఇప్పుడు సినిమాల్లో ఉండే సీన్లన్నీ అన్ నేచురల్ ఏనా? అంటే అవన్నీ అసహజమైనవేనా? అదేనండి.. పల్లెటూళ్ళో ఉండే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటే పాటలకు మాత్రం ఫారిన్ లొకేషన్లు ఎందుకు వెళతారు అని ప్రశ్నిస్తోంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరో కాదు.. ''దర్శకుడు'' సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఈషా రెబ్బా. ఆ సినిమాలో ఈ తెలుగమ్మాయ్ చేస్తున్న క్యారక్టర్ ఏంటంటే.. అక్కడ సినిమాల్లో పనిచేస్తున్న హీరోను.. అసలు దర్శకుడు చేసేదే ఏముంది.. పైగా మన సినిమాల్లో సీన్లు ఓ చోట పాటలు ఓ చోట అంటూ హేళన చేయడమే. దీనిపై ఇప్పుడు 'కార్తికేయ' ఫేం డైరక్టర్ చందు మొండేటి ఏమంటున్నాడో తెలుసా?

''సినిమాల్లోని చాలా సీన్లను మనం నిజం జీవితం నుండే తీసుకుంటాం. ఉదాహరణకు నేను ఈ మధ్యన తీసిన ప్రేమమ్ సినిమాలోఒక కొటేషన్ పెట్టాను. నిజానికి నా భార్య కూడా లెక్చరరే. నాది ప్రేమ వివాహం. తనకు ప్రపోజ్ చేసినప్పుడు.. 'ఈ ప్రపంచంలోని అందమైన అమ్మాయిలందరూ సినిమాల్లోనే లేరు. కొంతమంది లెక్చరర్లుగా కూడా ఉన్నారు' (All beautiful women in this world are not into movies. Some are into teaching too) అంటూ ఒక కొటేషన్ పంపాను. దానికే తను ఇంప్రెస్ అయ్యి నన్ను ప్రేమించింది. అదే నేను సినిమాలో కూడా వాడాను'' అంటూ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. సో సినిమాల్లోని సీన్లు అన్నీ అన్ నేచరుల్ కాదండోయ్. కొన్ని నిజంగా నిజాలే. దర్శకులే స్వీయానుభవాలే!!