Begin typing your search above and press return to search.
అందాల రాక్షసి పై నిర్మాత పిర్యాదు
By: Tupaki Desk | 19 Sep 2017 4:57 PM GMTఅందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించినా ఇప్పుడు మాత్రం వరుస అపజయాలను అందుకుంటోంది. అంతే కాకుండా అమ్మడు తన వ్యవహార శైలితో లేనిపోనీ వివాదాలను తెచ్చిపెట్టుకుంటోంది. ఇప్పటికే వరుసగా నాలుగు అపజయాలను అందుకున్న లావణ్య రీసెంట్ గా నాగ చైతన్య యుద్ధం శరణం తో ఇంకా డౌన్ అయ్యింది.
అయితే ఇలాంటి మూమెంట్ లో అమ్మడికి సమసిపోయిందనుకున్న వివాదం ఒకటి మళ్లీ మెడకు చుట్టుకుందట. అసలేం జరిగిందంటే.. 100% లవ్ సినిమాను చంద్రమౌళి అనే దర్శకుడు తమిళ్ రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా సెలెక్ట్ అయ్యాడు. అయితే మొదట హీరోయిన్ గా లావణ్య ని ఎంచుకున్నప్పుడు అమ్మడు ఒకే చెప్పిందట కానీ డేట్స్ అడ్జస్ట్ విషయంలో దర్శక నిర్మాతలను కాస్త ఇబ్బంది పెట్టి ఎందుకో గాని షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేసుకున్న సమయంలో తప్పుకుంది. దీంతో దర్శక నిర్మాతలు లావణ్య స్థానంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మొదట లావణ్య ఆ వివాదం ముగిసిపోయింది అనుకుంది కానీ ఆ చిత్రం దర్శక నిర్మాతలు లావణ్యపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు చేశారట.
సెప్టెంబర్ లో మొదలు కావాల్సిన షూటింగ్ ఆమె వల్ల అక్టోబర్ 11న స్టార్ట్ అయ్యిందని, మేము మళ్లీ అందరి షెడ్యూల్స్ మార్చి ఒప్పించడానికి చాలా నష్టపోయామని లావణ్యపై ఆరోపణలు చేశారట. అలాగే లావణ్య - విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ఇదే తరహాలో రిజెక్ట్ చేసి నిర్మాతకి కోపం తెప్పించిందని రీసెంట్ కొన్ని వార్తలు వెలువడ్డాయి.