Begin typing your search above and press return to search.

చందు మొండేటి కి 30 కోట్లు ఆఫ‌ర్!

By:  Tupaki Desk   |   11 Jun 2023 6:22 PM GMT
చందు మొండేటి కి 30 కోట్లు ఆఫ‌ర్!
X
'కార్తికేయ‌-2' తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన చందు మొండేటి జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఒక్క ప్లాప్ త‌ప్ప మిగ‌తావ‌న్ని భారీ విజ‌యాలు సాధించిన‌వే. ముఖ్యంగా కార్తికేయ సినిమా ఆయ‌న కెరీర్నే మార్చేసింది. తొలి ప్ర‌య‌త్నం స‌క్సెస్ అవ్వ‌డం అటుపై అదే సినిమాకు సీక్వెల్ చేసి మ‌రో విజ‌యాన్ని అందుకోవ‌డంతో చందు స్థాయిని పెంచింది. ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన `స‌వ్య‌సాచి` సినిమా మిశ్ర‌మ ఫ‌లితాన్ని అందించిన‌ప్ప‌టికీ చందు క్రియేటికి అద్దం ప‌ట్టిన చిత్రంగా నిలిచింది.

'సూర్య వ‌ర్సెస్ సూర్య‌'..`కిరాక్ పార్టీ `లాంటి సినిమాల‌కు రైట‌ర్ గానూ ప‌నిచేసారు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ స్థాయిలో `కార్తికేయే -3`ని తెర‌కెక్కించ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. అలాగే సూర్య లాంటి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు. మ‌రోవైపు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో నూ మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కూడా గీతా ఆర్స్ట్ సంస్థ‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే గీత బ్యాన‌ర్లో ఇదే కాదు చందు తో మ‌రో రెండు సినిమాలు..మొత్తంగా మూడు సినిమాల‌కు ఒప్పందం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మూడు సినిమాల‌కు గానూ చందు 30 కోట్లకు పైగా పారితోషికం అందుకున్న‌ట్లు వినిపిస్తుంది. ముందుగా సూర్య‌తో ఒక సినిమా.. ఆతర్వాత బాలీవుడ్ లో ఓ సినిమా చేసేలా గీత ఆర్స్ట్ ఒప్పందం చేసుకున్న‌ట్లు గ‌తంలోనే వార్త‌లొచ్చాయి. అయితే తాజాగా చైత‌న్య కూడా ఆస‌క్తి చూపించ‌డంతో ఆచిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

ఈ సంస్థ ఇన్ని ఆఫ‌ర్లు ఇవ్వ‌డం వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. అదే చందు అంటే ఆ సంస్థ అధినేత అల్లు అర‌వింద్ కి అపార‌మైన న‌మ్మ‌కం. చందుపై అత‌ని న‌మ్మ‌కం ఎలాంటింద‌న్నది ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కిచ్చిన మాట కోసం బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో త‌న‌క‌న్నా ఎక్కువ పారితోషికం ఆఫ‌ర్ చేసినా ఇచ్చిన మాట కోసం గీత దాట‌లేద‌ని చందు వ్య‌క్తిత్వాన్ని కొనియాడారు.