Begin typing your search above and press return to search.
శర్వానంద్ పై దర్శకుడు సీరియస్
By: Tupaki Desk | 4 July 2016 4:32 AM GMTపదేళ్లకి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా శర్వానంద్ పేరు ఎప్పుడూ ఏ చిన్న వివాదంలోనూ వినిపించింది లేదు. నొప్పించక తానొవ్వక అన్నట్టు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా సినిమాలు చేసుకొంటూ వెళుతుంటాడు. ఇటీవల వరుస విజయాలతో దూసుకెళుతూ తన మార్కెట్ ని అమాంతం పెంచేసుకొన్నాడు. అలాంటి శర్వానంద్ పై తాజాగా ఓ దర్శకుడు సీరియస్ అయ్యాడు. ఇది సంస్కారం కాదంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. శర్వానంద్ పై అంతగా సీరియస్ అయిన ఆ దర్శకుడు ఎవరో కాదు... చేరన్. తమిళంలో బ్లాక్ బస్టర్లు కొట్టిన చేరన్ ఆమధ్య శర్వానంద్ తో ఓ సినిమా చేశాడు. అది తెలుగు - తమిళంలో తెరకెక్కింది. అయితే కొన్ని కారణాలవల్ల తమిళంలో సినిమాని నేరుగా సీడీల రూపంలో విడుదల చేశారు. తెలుగులో మాత్రం రాజాధిరాజా పేరుతో ఇటీవలే విడుదలైంది. ఆ సినిమాని ప్రమోట్ చేయకపోగా - శర్వానంద్ పనిగట్టుకొని నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నాడనేది తమిళ దర్శకుడు చేరన్ ఆరోపణ. ఆ విషయం పైనే చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి చేరన్ బహిరంగంగా శర్వానంద్ పై విమర్శలు గుప్పించాడు.
``నమ్మి అవకాశమిస్తే సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేయడం సంస్కారం అనిపించుకోదు, విజయాల్లేని సమయంలో శర్వానంద్ తో ఈ సినిమా చేశా. కానీ ఇప్పుడు విజయాలున్నాయి కదా అని నా సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? రాజాధిరాజాకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. కానీ పనిగట్టుకొని సినిమాని కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నార``ని ఆయన ఆరోపించారు. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగిన స్రవంతి రవికిషోర్ - హీరోయిన్ నిత్యమీనన్ లపై కూడా చేరన్ మండిపడ్డారు.