Begin typing your search above and press return to search.
సురేందర్ రెడ్డి హ్యాండిచ్చాడని...
By: Tupaki Desk | 3 April 2017 6:34 AM GMTఇప్పటిదాకా ఇండియాలో ఏ అరంగేట్ర హీరూ ఖర్చు పెట్టని స్థాయిలో కన్నడ కుర్రాడు నిఖిల్ గౌడ తొలి సినిమాకు ఖర్చు చేశాడు అతడి తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. రూ.75 కోట్ల బడ్జెట్ తో ఆయన నిర్మించిన ‘జాగ్వార్’ సినిమా నిరాశనే మిగిల్చింది. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ కానీ.. రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకత్వం కానీ ఆ సినిమాను కాపాడలేకపోయాయి. అంత భారీ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరైంది.
ఐతే నిఖిల్ ను ఈసారి ఓ స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టి.. అతడికి విజయాన్నందించాలని ప్రయత్నం చేశాడు కుమారస్వామి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కోసం ఆయన గట్టి ప్రయత్నమే చేశాడు. భారీ పారితోషకం ఆఫర్ చేశాడు. ఒక టైంలో సురేందర్-నిఖిల్ కాంబినేషన్లో సినిమా పక్కా అన్నారు. కానీ తర్వాత అదేమీ లేదని తేలిపోయింది. ‘ధృవ’తో విజయాన్నందుకున్న సురేందర్ కు మెగాస్టార్ చిరంజీవితో పని చేసే అవకాశం దక్కడంతో కుమారస్వామికి హ్యాండిచ్చేశాడు.
ఇంకా ఒకరిద్దరు స్టార్ డైరెక్టర్లను ట్రై చేసి ఫెయిలైన కుమారస్వామి.. కన్నడ ఇండస్ట్రీకే చెందిన యంగ్ డైరెక్టర్ చేతన్ కుమార్ తో సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నాడు. చేతన్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తర్వాతి సినిమాకు ప్రారంభోత్సవం కూడా జరిపించేశాడు. లిరిసిస్ట్ గా శాండిల్ వుడ్ లోకి వచ్చిన చేతన్.. దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సీనియర్ హీరో అర్జున్ బంధువైన ధ్రువ సర్జా ఓ కొత్త హీరోను పెట్టి ‘బహదూర్’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. తర్వాత అతడితోనే ‘బజ్రారి’ అనే మరో హిట్టు కొట్టాడు. ఇప్పుడు నిఖిల్ కు కూడా హిట్టిచ్చి హ్యాట్రిక్ కొడతాడని కుమారస్వామి కుటుంబం ఆశిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/