Begin typing your search above and press return to search.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వస్తున్న 'స్వామిరారా' డైరెక్టర్..!
By: Tupaki Desk | 5 May 2021 1:30 AM GMTటాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ లను వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తెరపై చూపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. 'స్వామిరారా' అనే థ్రిల్లర్ తో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్.. ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత తీసిన 'దోచెయ్' 'కేశవ' 'రణరంగం' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూసిన సుధీర్ వర్మకు 'స్వామిరారా' మినహా మిగతా సినిమా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో 'రణరంగం' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సుధీర్.. ఇప్పుడు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్నారు.
హీరోయిన్లు రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ - పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటెర్టైనర్ ని డైరెక్టర్ సుధీర్ వర్మ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓ ప్రముఖ ఓటీటీకి డైరెక్ట్ రిలీజ్ పద్ధతిలో ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే సుధీర్ వర్మ సినిమాల మీద ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే కామెంట్స్ ఉన్నాయి. ఆయన గత చిత్రాలతో 'మనీ హీస్ట్' 'ప్లప్ ఫిక్షన్' 'నార్కోస్' వంటి పాపులర్ సినిమాలు - వెబ్ సిరీస్ లలోని సన్నివేశాల అనుకరణలు ఉంటాయని కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఏ ఇంగ్లీష్ సినిమాకి ఫ్రీమేకో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి కొన్ని సీన్స్ కోసం హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్స్ఫైర్ అవుతుంటానని స్వయంగా డైరెక్టర్ సుధీర్ వర్మ ఓ సందర్భంలో వెల్లడించారు. అందులోనూ 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని సుధీర్ రీమేక్ చేయబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. బహుశా ఇప్పుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అఫీసియల్ రీమేక్ కూడా అయ్యుండొచ్చు. ఏదేమైనా ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ తానేంటో నిరూపించుకోవాలని సుధీర్ వర్మ బాగా కష్టపడుతున్నట్లు సినీ జనాలు చెప్పుకుంటున్నారు.