Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి ఏం గుర్తుపెట్టుకోవాలి??

By:  Tupaki Desk   |   16 July 2017 8:04 AM GMT
ఆ అమ్మాయి ఏం గుర్తుపెట్టుకోవాలి??
X
ఒక్కోసారి మన డైరక్టర్లు భలే మాట్లాడుతుంటారు. అయితే వాళ్ళ మాటల్లో అసలు మీనింగ్ ఏంటో ఎవ్వరికీ తెలియదు కాని.. బయటకు మాత్రం డబుల్ మీనింగ్ ఒక్కటే తొణికిసలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక డైరక్టర్ చేసిన కామెంట్ల అలాగే వినిపిస్తున్నాయి. మనోడు పబ్లిక్ గా ఒక నటీమణికి చెప్పిన డైలాగ్ వెనుక ఆంతర్యం ఏంటనేది ఎవ్వరికీ అర్దంకావట్లేదు.

ఆ అమ్మాయి చాలా ఫిలింస్ లో చిన్నచిన్న పాత్రలు చేస్తోంది. తనతోపాటే షార్ట్ ఫిలింస్ లో నటించిన ఒక యువకుడిని పెళ్ళి చేసుకున్నప్పటికీ.. ఆమె స్ర్కీన్ పై మాత్రం చాలా హాటుగా కనిపించడానికి అస్సలు ఏ మాత్రం సంకోచించదు. అయితే ఆ అమ్మాయికి పెద్దగా బ్రేక్ వచ్చిందీ లేదులే. ఇప్పుడు మన దర్శకుడు తీసిన ఒక సినిమాలో ఆమెను ఒక చిన్న రోల్ కు పెట్టుకున్నారట. ఆ రోల్ లో ఆమె నటన నచ్చడంతో మరో రోల్ కోసం కూడా ఆమెను వేరే పెద్ద సినిమాలోకి తీసుకున్నారట. దీనితో మన దర్శకుడు.. 'నీకు ఎంత పెద్ద ఛాన్సిచ్చానో తెలుసుగా.. నువ్వు అది గుర్తుపెట్టుకో' అంటూ ఓపెన్ గానే చెప్పేశాడు.

ఇక్కడ రెండు విషయాలు ధ్వనిస్తున్నాయి. ఒకటి ఆ అమ్మాయి తనకు అవకాశం ఇచ్చాడని ఇతగాడిపై రెస్పెక్ట్ చూపించట్లేదా? రెండవది మన దర్శకుడు ఆమెకు వేరే ఏదన్నా విషయంలో వార్నింగ్ ఇస్తున్నాడా? ఆ దర్శకుడి స్టేట్మెంట్ ఇలాంటి ధ్వంద్వార్ధాలకే తావిచ్చింది.