Begin typing your search above and press return to search.
చైసామ్ దారిలో డైరెక్టర్ దంపతులు
By: Tupaki Desk | 17 Oct 2021 12:30 AM GMTబాలీవుడ్ లో స్టార్ కపుల్ విడాకులు అనేవి చాలా కామన్ విషయం. ఉత్తరాదికి చెందిన ఎంతో మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకున్నారు. రెండు మూడు ఏళ్ల వైవాహిక జీవితం నుండి మొదలుకుని రెండు పదుల వైవాహిక జీవితానికి కూడా బ్రేక్ చేసుకున్న వారు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. విడాకుల విషయంలో ఉత్తరాది వారితో పోల్చితే సౌత్ స్టార్స్ చాలా బెటర్ అనే టాక్ ఉంటుంది. కాని ఈమద్య కాలంలో సౌత్ సెలబ్రెటీలు కూడా విడాకుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటున్నారు. భాగస్వామితో కలిసి ఉండలేం అనుకుంటే ఖచ్చితంగా బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఇటీవలే నాగ చైతన్య మరియు సమంతలు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఆ విషయం గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరో సెలబ్రెటీ జంట విడాకులు సిద్దం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ డైరెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఆమెనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దర్శకుడు ఈమద్య కాలంలో ఆమె తో ఉండటం లేదట. ఇద్దరు కూడా పంతానికి పోయి విడి పోయేందుకు సిద్దం అయ్యారు అంటూ వారికి సన్నిహితులు అయిన వారు చెబుతున్నారు. వారిద్దరిని కలిపేందుకు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేదట. ఇద్దరు విడిపోవడమే తరువాయి అన్నట్లుగా ఉంది. ఇండస్ట్రీలో ఇలాంటివి మళ్లీ మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్ తరహాలోనే ఇలా అవ్వడం విచారకరం అంటున్నారు.
ఆ దర్శకుడు టాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలు చేసి సక్సెస్ లు దక్కించుకుని ఒక్కసారిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎక్కువగా సినిమాలు చేయలేక పోయాడు. మళ్లీ అతడు పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలో విడాకులు అతడి కెరీర్ పై ప్రభావం పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విడాకుల వల్ల వ్యక్తిగత జీవితం పై మాత్రమే కాకుండా ఖచ్చితంగా కెరీర్ పై కూడా ప్రభావం పడుతుంది. అది పాజిటివ్ గా అయ్యి ఉండవచ్చు.. నెగటివ్ గా అయినా అయ్యి ఉండవచ్చు. పెళ్లి చేసుకునే సమయంలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెళ్లి చేసుకుంటే మంచిది. ఆ తర్వాత విడాకులు అంటే రెండు జీవితాలు మాత్రమే కాకుండా వారితో ముడి పడి ఉండే జీవితాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.