Begin typing your search above and press return to search.
డైరెక్టర్ కట్స్ : ఆ 4 సినిమాలకు ఒక ముగింపు ఆచార్య..
By: Tupaki Desk | 28 April 2022 10:30 AM GMTప్రతి కథకూ ఓ బాధ్యత ఉంటుంది. భావోద్వేగం అంతర్లీనం అయి ఉంటుంది. కొరటాల శివ కథకు రెట్టించిన బాధ్యత ఉంటుంది. ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సంప్రదాయం ఉంటుంది. ప్రకృతిని అమితంగా ప్రేమించే గుణం ఉంటుంది. మనుషులను ప్రేమించే తత్వం అనంతం అని చెప్పే సైద్ధాంతిక నైతికత ఒకటి తప్పక ఉంటుంది. ఆ విధంగా నాలుగు సినిమాలు ఆయన స్థాయిని పెంచాయి. సామాజిక బాధ్యతను విడువని భావకుడు అని ఆయన్ను నిర్వచించేందుకు ఉపయోగపడ్డాయి.
అందుకే చరణ్ అన్న విధంగా ఆయన కథకుడు ఓ బుద్ధుడు.. ఓ వివేకానందుడు.. మనకు తెలిసిన గాంధీ..మనం ఆరాధించే శ్రీరాముడు..మనం నడయాడిన అడవి..మన ఛిద్రం చేస్తున్న ప్రకృతిని కాపాడే సాహసి.. ఆయనే ! ఇంకా చెప్పాలంటే ఆయన కథకుడే ! ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడ చెప్పిన మాటలకు ఆ నాలుగు సినిమాలూ ఓ గొప్ప తార్కాణాలు. ఇవ్వడంలో కొంత, నచ్చిన అమ్మాయిని ప్రేమించి బాధ్యతలను నిర్వర్తించడంలో కొంత.. ప్రేమ కోసమే మారడం ఇంకొంత ఆయన సినిమాల్లో గొప్పగా ఉంటాయి. కనుక దిద్దుకోవడానికి ఆమె లోపం కాదు అద్భుతం అని రాశారు మిర్చి సినిమాలో !
మొత్తం కథకు ప్రాణం అనిపించే సింగిల్ లైనర్ ఆయన ఆయువు.. డైలాగ్ అంటే గొప్ప సూక్తి కాదు జస్ట్ ఒక చిన్న భావోద్వేగం మాత్రమే ! అని అంటారాయన. కథలో అది అంతర్లీనం.. అంతర్భాగం.. అందుకే సహజాతి సహజంగా ఉండే మాటలకు ఆయన నెరేషన్ ప్రాసెస్ ఎంతో చేరువ. పంచ్ లూ, ప్రాసలూ అంటూ ఏ గోలా ఉండదు. అందుకే ఆ 4 సినిమాలూ ఆయన జీవితాన్ని మార్చాయి. ఈ నాలుగేళ్ల శ్రమ ఆ నాలుగు కథలకూ ఓ ముగింపు.
అవును!ఆచార్య.. కథకు ప్రాణం ధర్మ స్థలి. అక్కడే పోరు.. అక్కడే ప్రేమ..అన్నీ కలిసిన సినిమా కొరటాలకు ఇష్టమయిన కథతో నడిచే సినిమా..చిరు సైతం తనని తాను మార్చుకుని కొరటాల దర్శకత్వ శైలికి అనుగుణంగా నటించిన సినిమా..అవును ! ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది..మాస్, యాక్షన్,రొమాంటిక్ జానర్ లో సినిమాను చేయాలంటే అది ఆయనకే సాధ్యం..ఆ సినిమా విశేషాలు కొన్ని మీ కోసం.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. 100% సక్సెస్ రేట్‌తో, అతను డైరెక్టర్ గా స్టార్‌డమ్‌ని పొందారు. ప్రభాస్ మిర్చి తో మొదలు పెట్టి మహేశ్ తో శ్రీమంతుడు, తారక్ తో జనతా గ్యారేజ్, మళ్లీ మహేశ్ తో భరత్ అనే నేను చిత్రాలు తీసి సక్సెస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.. ఇవన్నీ బ్లాక్ బస్టర్స్. అందుకే కొరటాల డైరెక్షన్‌లో సినిమా విడుదలవుతోంది అంటే ఆడియెన్స్ అటెన్షన్ కూడా అంతే స్థాయిలో ఉంటోంది. సినిమా సినిమాకూ తన వర్క్ పై ఇండస్ట్రీ ఇచ్చే రెస్పెక్ట్ ను ఇంకా ఇంకా పెంచుకుంటున్నారీయన. ఇప్పుడు తెరకెక్కించిన ఆచార్య సినిమాతో ఐదో హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఇది మాత్రం పక్కా ! అందుకే నాలుగేళ్ల కృషి ఫలితం ఎలా ఉండనుందో అన్న ఆసక్తితో మెగా అభిమానులు ఉన్నారు. సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నీ బాగుండడంతో వారి అంచనాలు మరింత రెట్టింపు అయి ఉన్నాయి ఇవాళ.
ఇంకా చెప్పాలంటే..గతంలో చేసిన నాలుగు సినిమాలకూ, అందులో చెప్పిన అనేక సామాజిక సంబంధ విషయాలకు ముగింపు ఈ సినిమా అవుతుందని, ప్రీవియస్ రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నారు. అన్నింటికీ మూలం ధర్మం ధర్మాన్ని కాపాడడమే ఆచార్య ధ్యేయం. అదేవిధంగా అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకోవడం ఈ కథకు ఉన్న ముఖ్య ఉద్దేశం. అందుకే ధర్మాన్ని పరిరక్షించడమే ప్రధాన ధ్యేయమని పదే పదే చెబుతున్నారాయన. ఆ విధంగా ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేరాఫ్ కానుంది. కొన్ని సెన్సిబులిటీస్ ను సెల్యులాయిడ్ పై చూపించి ఆలోచింపజేయనుంది కూడా !
ముఖ్యంగా తండ్రి, కొడుకుల మధ్య సాగే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకోవడం ఖాయం అని దర్శకుడు అంటున్నారు. వాస్తవానికి కొరటాల శివ సినిమాల్లోని బలం ఎప్పుడూ తన కథలను ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పడం. ఆయన కథ కు ఉన్న బలం కారణంగా మేం మరీ ! బిల్డప్పులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు అని చరణ్ చెబుతున్నది ఇందుకే ! అవసరం మేరకే సన్నివేశాలు ఉంటాయి.
అవసరం ఉన్నా, లేకున్నా ఫార్ములాల కోసం ఇంకా చెప్పాలంటే సినిమా నిడివి పెంచడం కోసం ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ రాయరు. తీయరు. కథకు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా ఓ రొమాంటిక్ సన్నివేశాన్నో లేదా యాక్షన్ సీక్వెన్స్ నో చేర్చరు. 'ఆచార్య' కూడా అదే బాటలో నడుస్తుంది. చిరంజీవికి ఉన్న స్టార్ ఇమేజ్-ని దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆయన అభిమానుల ఆశలను నెరవేర్చనుంది. బాక్సాఫీసు అనే ధర్మ స్థలిలో విజయ కేతనం ఎగురవేయనుంది. డియర్ సర్ ఆల్ ద బెస్ట్.