Begin typing your search above and press return to search.

కొరియ‌న్ సినిమాలు కాపీ కొట్ట‌ను

By:  Tupaki Desk   |   4 July 2019 12:31 PM GMT
కొరియ‌న్ సినిమాలు కాపీ కొట్ట‌ను
X
హాలీవుడ్ సినిమాలు.. కొరియన్ సినిమాలు చూసి కథలు రాయడం నాకు నచ్చదు. ఏడాది పాటు కష్టపడి కథ రాసి సినిమా రిలీజైతే ఇదిహాలీవుడ్ కాపీ కథ కదా? అంటే ఆ కష్టం అంతా వృధా అయిన‌ట్టేన‌ని అన్నారు డైమండ్ ర‌త్న‌బాబు. ఈ యంగ్ ట్యాలెంటెడ్ రైట‌ర్ కం డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన `బుర్ర‌క‌థ‌` (ఆది హీరో) ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మీడియాతో ముచ్చ‌టిస్తూ ర‌త్న‌బాబు పైవిధంగా స్పందించారు.

రైట‌ర్ ట‌ర్న్ డ్ డైరెక్ట‌ర్ క‌దా.. అస‌లు మీ క‌థ‌లెలా పుడ‌తాయి? అన్న ప్ర‌శ్న‌కు డైమండ్ ర‌త్న‌బాబు స్పందిస్తూ.. హాలీవుడ్ సినిమాల‌ను స్ఫూర్తి గా తీసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని అన్నారు. అందుకే కాపీ కొట్ట‌కూడ‌ద‌ని నాకు నేను చాలా స్ట్రిక్ట్ గా అనుకున్నాను. స్ఫూర్తితో క‌థ‌లు రాయొద్ద‌ని నా క‌లం పైనే ఒట్టు పెట్టుకున్నాను అని తెలిపారు. అయితే ఇంకెక్క‌డి నుంచి స్ఫూర్తి అంటే? ``రామాయణం.. మహాభారతం లో చాలా కథలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ఈ కథ రాసుకున్నా.. అని తెలిపారు. పాత్ర‌ల్ని ఎలా సృష్టించారు? అంటే ``నేను పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నపుడు చాలా మందిని ప‌రిశీలించేవాడిని. వాటిలోంచి కొన్ని పాత్రలుతీసుకున్నా`` అని తెలిపారు.

`బుర్ర కథ`కు స్ఫూర్తి లేదా? అంటే .. ఒక ఫోన్ లో రెండు సిమ్ కార్డులు ఉన్నప్పుడు.. ఒక మనిషిలో రెండు బ్రెయిన్స్ ఉంటే ఎలా ఉంటుంది.. అన్న ఐడియాలోంచి క‌థ పుట్టింద‌ని తెలిపారు. డ్యూయల్ సిమ్ కార్డు ఫోన్ స్ఫూర్తి అని వెల్ల‌డించారు. క‌థ కోసం ప‌రిశోధించారా? అన్న ప్ర‌శ్న‌కు.. ఐడియా రాగానే వెంటనే అంత‌ర్జాలంలో శోధించాను. ఈ వ‌ర‌ల్డ్ లో ఇలా ఎవరైనా ఉన్నారా? అని వెతికితే .. రెండు బ్రెయిన్స్ తో పుట్టినవారు 16 మంది ఉన్నారు. ర‌క‌ర‌కాల ఏజ్ ల‌లో వాళ్లంతా మరణించారు. అయితే బ్రతికి ఉంటే ఎలా ఉండేవారు? అనేదే నా సినిమా. ప్రతి ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే అందులో ఒకరు మాస్ మరొకరు క్లాస్ గా ఉంటారు. మా మూవీలోనూ అభి.. రామ్ అనే రెండు పాత్ర‌లుంటాయి. ఒకరు బాగా చదివేవాడైతే.. ఇంకొక‌డు బాగా అల్లరి చేసే టైపు.. అంటూ వివ‌రాల్ని అందించారు.