Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డైరెక్ట‌ర్ పెళ్లి చేసుకోడా?

By:  Tupaki Desk   |   10 April 2017 4:12 AM GMT
ప‌వ‌న్ డైరెక్ట‌ర్ పెళ్లి చేసుకోడా?
X
‘కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం’ లాంటి క్లాస్ ల‌వ్ స్టోరీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు కిషోర్ కుమార్ పార్థ‌సాని (డాలీ). ఆ త‌ర్వాత అనుకోకుండా ‘త‌డాఖా’ లాంటి రీమేక్ సినిమా చేశాడు. ఆపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌రుస‌గా ‘గోపాల గోపాల‌’.. ‘కాట‌మ‌రాయుడు’ సినిమాలు చేశాడు. చూడ్డానికి ఫ్యామిలీ మ్యాన్ లాగా క‌నిపించే డాలీ.. అస‌లింత వ‌ర‌కు పెళ్లే చేసుకోలేద‌ట‌. భ‌విష్య‌త్తులో కూడా అత‌డికి పెళ్లి చేసుకునే ఉద్దేశాలేమీ లేవ‌ట‌. త‌న‌కు సినిమాల‌తోనే పెళ్లి అయింద‌ని.. ఇక వేరే పెళ్లి అక్క‌ర్లేద‌ని ఒక ఇంట‌ర్వ్యూలో డాలీ వ్యాఖ్యానించ‌డం విశేషం.

‘‘వివాహ బంధం మీద నాకంత నమ్మకం లేదు. ఈ విషయమై ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. తర్వాత అర్థం చేసుకున్నారు. నాకు ఒంటరితనం బాగా ఇష్టం. ఖాళీ దొరికితే బ్యాగులో రెండు జతల బట్టలు వేసుకొని ఒకరిద్దరు స్నేహితుల్ని తీసుకొని కారులో దూర ప్రయాణానికి వెళ్లిపోతాను. భార్యాపిల్లలు ఉన్నవారికి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉండదు. నాకు సినిమాతోనే పెళ్లి అయింది... కాబట్టి మరో పెళ్లి చేసుకోలేదు’’ అని డాలీ అన్నాడు.

ఇక త‌న కెరీర్ గురించి చెబుతూ.. ‘‘కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం త‌ర్వాత స్ట్రెయిట్ మూవీనే చేయాల‌నుకున్నా. కానీ అనుకోకుండా ‘త‌డాఖా’ లాంటి రీమేక్ చేయాల్సి వ‌చ్చింది. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో గోపాల గోపాల.. కాట‌మ‌రాయుడు లాంటి రీమేక్స్ వ‌చ్చాయి. ప్రస్తుతం నా దగ్గర రెండు మూడు కథల లైన్లు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయి స్క్రిప్టులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న పని. ఈసారి స్ట్రెయిట్ మూవీ చేయాల‌నుకుంటున్నా’’ అని డాలీ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/