Begin typing your search above and press return to search.
పవన్ డైరెక్టర్.. పవన్ భక్తుడితో
By: Tupaki Desk | 22 May 2018 3:53 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు ఎంతటి అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రతి సినిమాలోనూ పవన్ రెఫరెన్స్ ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటాడతను. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ తో పని చేసిన టెక్నీషియన్లతో పని చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తుంటాడు. ఈ కోవలోనే పూరి జగన్నాథ్.. కరుణాకరన్.. త్రివిక్రమ్ లాంటి దర్శకులతో సినిమాలు చేశాడు. ఇప్పుడు అతను మరో పవన్ దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. పవన్ తో ‘గోపాల గోపాల’.. ‘కాటమరాయుడు’ లాంటి సినిమాలు తీసిన కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడట.
‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ లాంటి క్లాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన డాలీ.. తర్వాత రీమేక్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘తడాఖా’.. ‘గోపాల గోపాల’.. ‘కాటమరాయుడు’.. ఇలా అతను తర్వాత తీసిన ఈ మూడు సినిమాలూ రీమేక్ లే. ‘కాటమరాయుడు’ ఫలితం డాలీ కెరీర్ ను అయోమయంలో పడేసింది. అతడికి తర్వాత అవకాశాలే లేకపోయాయి. మరి పవన్ సిఫారసుతో ఏమైనా నితిన్ అవకాశమిచ్చాడో ఏమో తెలియదుకానీ.. డాలీతో అతను పని చేయబోతుండటం మాత్రం వాస్తవం. ఈ చిత్రాన్ని నితిన్ సొంత సంస్థే నిర్మిస్తుందంటున్నారు. ప్రస్తుతం నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత డాలీ సినిమాను మొదలుపెడతాడట.