Begin typing your search above and press return to search.
శృతి ఘోరమైన కాస్ట్యూమ్స్ కథ ఇదీ
By: Tupaki Desk | 30 March 2017 7:47 AM GMTపవన్ కళ్యాణ్ తో కలిసి రెండోసారి జట్టు కట్టిన ఏకైక హీరోయిన్ గా శృతి హాసన్(ఒక్క రేణూ దేశాయ్ తక్క) రికార్డ్ సృష్టించినపుడు.. అభిమానులంతా కాటమరాయుడు చిత్రంతో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించారు. కానీ మూవీలో చూస్తే శృతిహాసన్ చాలా ఘోరంగా కనిపించింది. అసలే ఈ ముద్దుగుమ్మ కాసింత ఒళ్లు చేస్తే.. దాన్ని కప్పిపెట్టేలా కాకుండా.. ఆమెను మరింత డీ గ్లామరైజ్ చేసేలా డ్రెస్సులు ఉన్నాయి.
శృతి వేసుకున్న కాస్టూమ్స్ ను.. ఏ రోడ్ సైడ్ ఫుట్ పాత్ షాప్ లో కొనుక్కొచ్చారో అంటూ విమర్శలు వినిపించాయి. శృతి స్టైలింగ్ పై వచ్చిన విమర్శలపై ఇప్పుడు దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని స్పందించాడు. కాటమరాయుడు శృతి స్టైలింగ్.. ముఖ్యంగా పాటల్లో ఆమె కాస్ట్యూమ్స్ సరపడని విధంగా ఉన్నాయని అంగీకరించాడు. 'శృతి కాస్ట్యూమ్స్.. స్టైలింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయన్న మాట నిజమే. ఈ మూవీ పాటల్లో కాస్ట్యూమ్స్ కు ముంబై డిజైనర్లను తీసుకున్నాం' అని చెప్పాడు డాలీ.
'వారికి పేమెంట్స్ పూర్తి చేసేసి.. మేం లొకేషన్ కు వెళ్లిపోయాం. కనీసం ముందుగా వాటిని చెక్ చేసుకోలేదు కూడా. తీరా షూటింగ్ స్పాట్ కి వెళ్లాక శృతి గెటప్ ని చూసి అందరం షాక్ తినేశాం. ఎవరికీ ఆ డ్రెసింగ్ నచ్చలేదు. కానీ.. అది ఫారిన్ షూటింగ్ కావడంతో.. కనీసం వాటిని మార్చే టైమింగ్ కూడా మాకు లేదు. అందుకే ఆ డ్రెస్ లతోనే షూటింగ్ పూర్తి చేశాం' అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు దర్శకుడు. రీజన్స్ ఏవైతేనేం.. రొమాంటిక్ టచ్ ఎక్కువగా మూవీలో హీరోయిన్ బాగోకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పేందుకు కాటమరాయుడు ఎగ్జాంపుల్ అయిపోయింది. ప్చ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/