Begin typing your search above and press return to search.

స‌మంత అది వాడ‌కుండానే...

By:  Tupaki Desk   |   10 Nov 2022 2:30 AM GMT
స‌మంత అది వాడ‌కుండానే...
X
క్రేజీ హీరోయిన్ స‌మంత కీల‌క పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `య‌శోద‌`. తొలి మ‌హిళా ప్ర‌ధాన పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా ద్వారా హ‌రి - హ‌రీష్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, ఉన్ని ముకుంద‌న్‌, రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ‌, సంప‌త్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భారీ స్థాయిలో సైన్స్ ఫిక్ష‌న్ గా స‌రోగాసీ మాఫియా నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు.

తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని న‌వంబ‌ర్ 11న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. స‌మంత ఛాలెంజింగ్ తీసుకుని య‌శోద పాత్ర‌లో న‌టించింది. పోరాట ఘ‌ట్టాలు, డాగ్ ఛేజ్ సీన్స్ ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇదిలా వుంటే మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన స‌మంత ఇంట‌ర్వ్యూ సినిమాపై మ‌రింత క్రేజ్ ని, సింప‌తీని క్రియేట్ చేసింది. సామ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూనే ఈ మూవీని పూర్తి చేశాన‌ని చెప్ప‌డం.. భావోద్వేగానికి గురి కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై సింప‌తీ క్రియేట్ అయింది.

ఇదిలా వుంటే సినిమా మ‌రో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఈ మూవీ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న హ‌రి - హ‌రీష్ సామ్ కు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విశేషాల్ని వెల్ల‌డించారు. సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన హ‌రి - హ‌రీష్ .. స‌మంత గురించి, సినిమా కాన్సెప్ట్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాల్ని వెల్ల‌డించారు. త‌మిళంలో నాలుగు సినిమాలు చేసిన తాము తెలుగులో ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నామ‌న్నారు.

`య‌శోద‌` మూవీని ముందు త‌క్కువ బ‌డ్జెట్ లో చేయాల‌నుకున్నామ‌ని, అయితే నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ క‌థ విని దీన్ని బారీ బ‌డ్జెట్ లో ఎందుకు తీయ‌కూడ‌ద‌న్నార‌ని, కంటెంట్ బాగుంది. గ్లోబ‌ల్ రీచ్ వుంటుంద‌ని ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా చేద్దామ‌న్నార‌ని తెలిపారు. స‌మంత‌ను క‌లిశాక సినిమాని భారీ స్థాయిలో చేయాల‌ని ఫిక్స‌య్యామ‌న్నారు. క‌థ చాలా కొత్త గా వుంటుంద‌ని, టెక్నిక‌ల్ గా సినిమా స‌రికొత్త‌గా వుంటుంద‌న్నారు. స‌రోగ‌సీ సినిమాలో ప్ర‌ధాన ప్లాట్ కాద‌ని, సినిమాలో అంత‌కు మించిన అంశాలున్నాయ‌న్నారు.

స‌మంత ఎంత పెద్ద సీన్ అయినా స‌రే రెండు నిమిషాలు టైమ్ తీసుకుని వెంట‌నే చేసేస్తార‌ని, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో ఆమె గ్లిజ‌రిన్ కూడా వాడ‌లేద‌ని తెలిపారు. ప్ర‌తి 20 నిమిషాల‌కు సినిమాలో ఒక మూవ్ వుంటుంది.. సినిమాలో స‌ర్ ప్రైజ్ లు షాక్ కు గురిచేస్తాయ‌ని, స‌మంత వ‌ల్ల ఏ విష‌యంలోనూ సినిమాకు అంత‌రాయం ఏర్ప‌డ‌లేదన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.