Begin typing your search above and press return to search.
చరణ్ - అర్జున్ మరో అడుగు ముందుకు పడిందా?
By: Tupaki Desk | 25 Oct 2022 5:47 AM GMTఅల్లు అరవింద్ చాలా సంవత్సరాలుగా తన కొడుకు అల్లు అర్జున్ మరియు మేనల్లుడు రామ్ చరణ్ లతో చరణ్ అర్జున్ అనే సినిమాను చేయాలని భావిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖంగా ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా ప్రస్తావన లేక పోవడంతో వార్తలు రావడం లేదు.
ఇటీవల అలీ తో సరదాగా టాక్ షో లో అల్లు అరవింద్ మళ్లీ చరణ్ అర్జున్ లతో తన చరణ్ అర్జున్ సినిమా ను గురించి మాట్లాడి మళ్లీ ఆ సినిమాను వార్తల్లో నిలిపిన విషయం తెల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఆ టైటిల్ ను రెన్యువల్ చేయిస్తూనే ఉన్నాను అంటూ అల్లు అరవింద్ ప్రకటించడంతో కచ్చితంగా సినిమా ఉంటుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లతో చరణ్ అర్జున్ సినిమా గురించి ఇన్నాళ్లు కేవలం టైటిల్ మరియు నిర్మాత వరకే ప్రచారం జరిగింది. మొదటి సారి దర్శకుడి గురించి కూడా ప్రచారం మొదలు అయ్యింది. చరణ్ అర్జున్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
అల్లు అరవింద్ స్వయంగా ఈ విషయంలో త్రివిక్రమ్ ను రిక్వెస్ట్ చేశాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. కనుక వీరిద్దరి కాంబోలో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా మళ్లీ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
అది చరణ్ అర్జున్ అయితే అంతకు మించి సందడి ఉండదు అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ అతి త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా ఓకే చేసి రాబోయే రెండేళ్లలో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు లేకపోలేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే 2025 లోపు లోనే చరణ్ అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అదే నిజం అయితే బాగుండు అన్నట్లుగా ప్రతి ఒక్క మెగా అభిమానితో పాటు సినీ అభిమాని కూడా కోరుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.