Begin typing your search above and press return to search.
నివేద దర్శకుల్నే వేధిస్తుందట!
By: Tupaki Desk | 6 March 2019 5:30 PM GMT`జై లవకుశ` తర్వాత హఠాత్తుగా మాయమైపోయింది నివేద థామస్. అంత ప్రతిభావని.. ఉన్నట్టుండి ఇలా మాయమైందేం? అంటూ అభిమానుల్లో బోలెడన్ని సందేహాలు తలెత్తాయి. అయితే అన్నిటికీ 118 ఇంటర్వ్యూల్లో ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చేసింది. ఎన్టీఆర్ `జై లవకుశ` షూటింగ్ పూర్తవ్వగానే బ్యాచిలర్ ఎడ్యుకేషన్ పూర్తి చేయడంపై దృష్టి సారించానని - ఓ థీసిస్ పని మీద ఆర్నెళ్ల పాటు వెళ్లాల్సి వచ్చిందని అందమైన నిజాన్ని చెప్పింది నివేద. డిగ్రీ పూర్తి చేశాక నేరుగా కళ్యాణ్ రామ్ సినిమాలో చిన్న పాత్ర అయినా గ్రిప్ ఉన్న పాత్ర దొరికింది. నటించేసాను. ఇకపై టాలీవుడ్ ని బొమ్మాళీలా ఓ పట్టు పడతానని చెప్పింది. ఇక్కడ తనకు వచ్చే ఏ అవకాశాన్ని వదిలి పెట్టనని అంది. నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న భామ కాబట్టి అస్సలు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నివేద చెప్పకనే చెప్పింది.
అయితే నివేదలో ఆ ఒక్క క్వాలిటీనే కాదు.. సుతిమెత్తగా మాట్లాడి మనసు కొల్లగొట్టే విద్య కూడా ఉంది. దాంతో పాటు ఈ అమ్మడికి దర్శకుల్ని ఓ విషయంలో వేధించే అలవాటు ఉందని 118 డైరెక్టర్ గుహన్ ఓ చిట్ చాట్ లో క్లియర్ కట్ గా చెప్పేసారు. వేధించడం అంటే అదంతా ఔట్ పుట్ కోసమేనట. తాను చేయబోయే సన్నివేశం ఎలా ఉంటుందో ముందే తెలియాలని పట్టు పడుతుందట. తన ప్రతి డైలాగ్ ను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే చెప్తుంది. ఆ తపన ఎంతగా ఉంటుంది అంటే తమకే తెలియని ఎన్నో విషయాల్ని తమ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తుందని గుహన్ తెలిపారు.
అంటే నెక్ట్స్ ఏం తీయబోతున్నారు? అన్నదానిపై చాలా ముందు నుంచే నివేద కసరత్తు చేస్తుందన్నమాట. సీన్ పేపర్ లో ఏం ఉందో తనకు తెలియాలని పట్టుబడుతుంది. అది దర్శకుడు ముందే తనకు చెప్పాల్సిందేనట. అలా చెప్పిన తర్వాత దానిపై పక్కాగా ప్రిపేరైపోతుంది. తన పాత్ర స్వభావం, స్క్రిప్టులో డైలాగులు ప్రతిదీ కంఠతా పట్టేస్తుందట. ఇలాంటి అమ్మాయి వల్ల ఆమెకు తెలియని విషయాలు చెప్తూనే నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని గుహన్ అన్నారు. పని విషయంలో అంత డెడికేటెడ్‌గా ఉండే కథానాయికను చూడలేదని చెప్పారాయన. 118లో తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసిందని వెల్లడించారు. నివేద ప్రస్తుతం తదుపరి సినిమాలకు స్క్రిప్టులు వినే పనిలో ఉందిట.