Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకోండి .. 'సీతా రామం' థియేటర్లలో ఇదే జరుగుతుంది!

By:  Tupaki Desk   |   4 Aug 2022 3:55 AM GMT
రాసి పెట్టుకోండి .. సీతా రామం థియేటర్లలో ఇదే జరుగుతుంది!
X
హను రాఘవపూడి అనగానే ఆయన తెరకెక్కించిన ప్రేమకథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'సీతా రామం' రూపొందింది. వైజయంతీ మూవీస్ .. స్వప్న సినిమాస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. దుల్కర్ - మృణాల్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకమైన పాత్రను పోషించింది.

ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'ప్రభాస్' చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై హను రాఘవపూడి మాట్లాడుతూ .. " ఈ సినిమా నన్ను నేను సంస్కరించుకోవడానికి ఉపయోగపడింది. నేను మరో మెట్టు ఎక్కానని అనుకుంటున్నాను.

ఈ సినిమా ఈ రోజున ఈ షేప్ లో ఉండటానికీ .. నేను ఇంత ధైర్యంగా ఉందని కారణం స్వప్న దత్ గారు. నేను ఇంతవరకూ అద్భుతమైన సినిమాలేం చేయకపోయినా స్వప్న గారు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను కంటిన్యూగా రెండు ఫ్లాపులు ఇచ్చాను .. కాకపోతే ఈ సారి మాత్రం అది రిపీట్ కాదు. నేను చాలా గర్వంతోనో .. అహంకారంతోనో చెప్పడం లేదు .. కాన్ఫిడెంట్ తో చెబుతున్నాను. ఈ సినిమా తీయడానికి కొన్ని పేజీలపై రాసుకున్న అక్షరాలు సరిపోవు .. బుర్రలో ఉన్న ఆలోచనలు సరిపోవు.

ఈ సినిమా తీయడం ఒక యుద్ధం .. యుద్ధం చేయడానికి సైన్యం కావాలి. అ లాంటి ఒక యుద్ధం చేయడానికి నాకు యోధులు దొరికారు. ఆ యుద్ధం సినిమా ప్రమోషన్స్ కి 'బాహుబలి' వచ్చేలా చేసింది. ఈ సినిమాలో హీరోగా దుల్కర్ బాగుంటాడని స్వప్న అంటే వెళ్లి ఆయనకి కథ వినిపించి ఒప్పించాను. హీరోయిన్ గా కొత్త ఫేస్ అయితే బాగుంటుందని అనుకుంటే, మళ్లీ స్వప్న గారు మృణాల్ పేరు చెప్పడం .. నేను ముంబై వెళ్లి కథ చెప్పడం .. ఆమె ఒప్పుకోవడం జరిగిపోయింది.

ఆఫ్రిన్ పాత్రకి రష్మిక బాగుంటుందని స్వప్నగారు అంటే .. వెళ్లి ఆమెకి కథ వినిపించాను. తను ఉన్న కఫర్టు జోన్ లో నుంచి బయటికి వచ్చి ఈ పాత్రను చేయడానికి రష్మిక ఆలోచన చేసింది .. ఒక రోజు సమయం తీసుకుని ఆ తరువాత ఒప్పుకుంది. తెరపై ఏ ఆర్టిస్ట్ కనిపించరు .. పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నటీనటులంతా కూడా అంత గొప్పగా చేశారు. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టాడు. వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా అనిపిస్తుంది.

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎవరి దృష్టి కూడా మొబైల్ వైపు వెళ్లదు. అంతగా ఎవరికి వారు స్క్రీన్ కి అంకితం చేసుకుంటారు. ఈ సినిమా కోసం మళ్లీ మళ్లీ మీరు థియేటర్ కి వస్తూనే ఉంటారు" అని చెప్పుకొచ్చాడు.