Begin typing your search above and press return to search.
రష్మిక మా సినిమాలో హీరోయిన్ కాదు...!
By: Tupaki Desk | 3 May 2022 3:30 AM GMTదుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం 'సీతారామం'. ఈ సినిమా లో రష్మక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో ఆమె పాత్ర గురించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శ్రీరామ నవమి సందర్బంగా విడుదల అయిన ప్రోమో లో రష్మిక మందన్నా లుక్ చూసి అంతా కూడా సినిమా పై ఆసక్తి పెంచేసుకున్నారు.
సినిమా లో రష్మిక మందన్నా పాత్ర ఏంటీ.. ఆమె నేపథ్యం ఏంటీ అనే విషయమై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సినిమాపై మరియు రష్మిక పాత్ర పై మరింతగా అంచనాలు పెంచాడు అనడంలో సందేహం లేదు. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదు అంటూనే ఆమె పాత్ర పై చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హను రాఘవపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా లో రష్మిక పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అఫ్రీన్ అనే కాశ్మీర్ ముస్లీం అమ్మాయి పాత్ర లో రష్మీక మందన్నా ను చూడబోతున్నారు. సినిమా లో హీరోయిన్ రోల్ లో ఆమె ఒదిగి పోయి నటించింది. హీరోయిన్ గా కాకుండా ఒక హీరో తరహా పాత్రను రష్మిక పోషించిందన్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు.
ఆ పాత్ర కోసం రష్మిక చేసిన హోం వర్క్ గురించి కూడా దర్శకుడు గొప్పగా చెప్పుకొచ్చాడు. అఫ్రీన్ పాత్ర ను చేయడానికి ముందు ఎంతో మంది వీడియోలను రష్మిక చూసింది. అంతే కాకుండా ఎన్నో ఫోటోలు చూసి ఆన్ లైన్ లో పలు విషయాలను తెలుసుకుంది. ఆమె కళ్లతోనే అద్బుతమైన హావభావాలను పలికించి నటించిందని దర్శకుడు ప్రశంసించాడు.
తమ సినిమాలోని అఫ్రీన్ పాత్ర కు రష్మిక మందన్నా సరైన ఎంపిక అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కళ్లతో నటించగల అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న సమయంలో మాకు రష్మిక దొరికింది అన్నట్లుగా దర్శకుడు తెలియజేశాడు. సినిమాలో యుద్దం మరియు ప్రేమ ను చాలా ఎమోషనల్ గా దర్శకుడు చూపించబోతున్నాడు. సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మరియు మలయాళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.