Begin typing your search above and press return to search.
సెట్ లో అసిస్టెంట్స్ తో హను రాఘవపూడి గొడవ!
By: Tupaki Desk | 18 Sep 2022 12:25 PM GMT`సీతారామం`తో టాలీవుడ్ కి మరో క్లాసిక్ హిట్ దక్కిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో దుల్కార్ సల్మాన్...మృణాల్ ఠాకూర్ జం టకి మంచి పేరొచ్చింది. రామ్ ..సీత పాత్రలో ఇద్దరు ఆద్యంతం ఆక్టుకున్నారు. ఇక దర్శకుడిగా హను రాఘవపూడికి కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతోన్న రాఘవపూడికి ఈ సినిమా సక్సెస్ కెరీర్ ని కొత్త పంథాలో నడిపిస్తుంది.
ప్రస్తుతం ఈ యంగ్ మేకర్ అవకాశాలు క్యూలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సన్నివేశం మల్లీశ్వరి సినిమా సీన్ కి కాపీ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ ట్రోలింగ్ పై హను స్పందించారు. ``నేను ఎలాంటి కాపీ సీన్ చేయలేదు. లవ్ ప్రపోజల్ సీన్ చాలా సింపుల్ ఐడియా. ఒక అబ్బాయి తన ప్రేయసికి భరోసా ఇవ్వడానికి ఆ సీన్ లో చూపించాలనుకున్నా.
అందుకే హీరోతో నెలకు 600 సంపాదిస్తున్నా. బ్యాంక్ లో 12000 ఉన్నాయి. దాంతో ఇల్లు కొందాం అని చెప్పించా. ఇది బేస్ ఐడియా మాత్రమే. దీన్ని మల్లీశ్వరి నుంచి కాపీ కొట్టాల్సిన పనిలేదు. అయినా మల్లీశ్వరితో పోల్చినందుకు ఆనందంగా ఉంది` అని ట్రోలర్లపై సెటైర్ వేసారు. అలాగే ఈసినిమాలో కి దుల్కార్ సల్మాన్ అనుకోకుండా వచ్చాడు? అన్న సందేహాన్ని నివృతి చేసారు.
`సీతారామం` కోసం చాలా మంది హీరోల్ని అనుకున్నట్లు..వాళ్లు తిరస్కరించిన తర్వాత దుల్కార్ వచ్చినట్లు భావిస్తున్నారు. అవన్నీ అవస్తవాలు. ఈ స్టోరీ రాసినప్పుడు ఈ పాత్రకి దుల్కార్ అయితే బాగుంటుందని అనుకున్నా. ఆయన్ని మాత్రమే ఊహించుకుని కథ రాసా. ఈ సినిమా ప్రకటించిన తర్వాత రామ్ ..నాని.. విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో ల్ని కలిసా.
దాంతా వాళ్లందరు కాదన్న తర్వాత దుల్కార్ వద్దకు వెళ్లననుకుంటున్నారు. అలాంటిదేమి లేదు. నానితో ఓ సినిమా చేయాలనుకుంటున్నా. అది రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో ఉంటుంది. అందుకోసం నాని ని కలిసా. రామ్..విజయ్ ని వేరే కథలతో అప్రోచ్ అయ్యా` అన్నారు.
అలాగే సినిమా క్లైమాక్స్ లో రామ్ పాత్ర ముగింపు కొంత మందికి నచ్చలేదు. ఆ పాత్రని చంపకుండా ఉంటే బాగుండన్నారు. కానీ నా కోణంలో రామ్ అద్భుతమైన వ్యక్తి. అలాంటి పాత్ర ముగింపు ఇలా కాకుండా పాక్ బంధీగా ఉండి ఇండియాకి తిరిగొస్తే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారు అనిపించింది. ఈ విషయంలో నాకు..అసిస్టెంట్స్ కి గొడవలు జరిగాయి. కానీ నా విజన్ స్వప్న దత్ మాత్రమే అర్ధం చేసుకున్నారు. అందుకే సినిమా అంత బాగా వచ్చింద``న్నారు.
హను రాఘవపూడి మును ముందు అన్ని పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తున్నట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హీరోలంతా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఆ కాంబినేషన్స్ ఎప్పుడు సెట్ అవుతాయన్నది చూడాలి.