Begin typing your search above and press return to search.
రిలీజ్ టైమ్ లో టైటిల్ చేంజ్
By: Tupaki Desk | 5 Feb 2018 6:19 AM GMTఅమృతం సీరియల్ తో నటుడిగా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ ఆ తరువాత రైటర్ గా మరీన సంగతి తెలిసిందే. ఇష్క్ - గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో మాటల రచయిత క్లిక్ అయిన హర్ష మనం సినిమాకు కూడా మాటలను అందించి కెరీర్ ని రెండు వైపులా కొనసాగించాడు. ఇక దర్శకుడిగా కూడా ఈ రచయిత అడుగులు వేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమాను గత ఏడాది స్టార్ట్ చేశాడు.
తెలుగు యాంకర్ శ్రీ ముఖి అలాగే తమిళ నటుడు కిశోర్ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. హర్ష కూడా సినిమలో ఒక కీలక పాత్రను చేస్తున్నాడు. గత ఏడాది సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంత చేసుకుంది. అయితే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న సమయంలో దర్శకుడు టైటిల్ ని మార్చేస్తున్నామని షాక్ ఇచ్చాడు. క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఊహించని విధంగా ఎదుర్కొనే గూగ్లీ బంతిలాగే మా సినిమా ఉంటుంది.
సో.. అదే విధంగా మా సినిమా కొన్ని వేరియేషన్స్ లో ఊహించని విధంగా ఉంటుంది. అందుకే సినిమా టైటిల్ ను గుగ్లీ అని సెట్ చేస్తున్నట్లు దర్శకుడు హర్షవర్ధన్ ఇటీవల మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చాడు. శ్రీ ముఖి సినిమాలో మూడు విభిన్న పాత్రలో కనిపించబోతోందట. అందరికి తప్పకుండా సినిమా నచ్చుతుందని చెబుతున్నారు. మరి వీరి గుగ్లీ కి ప్రేక్షకులు ఏ విధంగా ఫిదా అవుతారో చూడాలి.