Begin typing your search above and press return to search.
ఇద్దరు హీరోలను అవమానించిన దర్శకుడు
By: Tupaki Desk | 31 Dec 2018 5:17 AM GMTఅతనో స్టార్ డైరెక్టర్. గత ఏడాది సక్సెస్ మీట్లో మాత్రమే హిట్ అని చెప్పుకున్న ఓ పెద్ద హీరో మూవీ తర్వాత ఇంకే అవకాశం తలుపు తట్టలేదు. తన సినిమాలో కంటెంట్ లేకపోయినా క్రిటిక్స్ విమర్శించారని నానా రకాలుగా నోరు పారేసుకుని ఆ కోణంలో పాపులారిటీ తెచ్చుకున్న ఇతగాడు ఏడాదిన్నరగా కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నాడు కానీ ఎదురుచూపులు మాత్రం తీరడం లేదు. అయితే ఇతని వ్యవహార శైలి తెలిసే కొందరు దూరం పెడుతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఇక ఇప్పుడు మరో వార్త ఇతని వివాదాస్పద శైలిని మరోసారి బయటపెడుతోంది. రెండేళ్ల క్రితం తమిళ్ లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ ని రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు ఈ దర్శకుడు. విలన్ అయినప్పటికీ హీరోతో సమానంగా ప్రాధాన్యం ఉండే పాత్ర కోసం ఇప్పటికే ఓ హీరో ఓకే చెప్పాడు. ఇటీవలే ప్రయోగం చేయబోయి హ్యాట్రిక్ మిస్ అయిన ఈ హీరో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
అయితే ఈ పాత్ర ఇతని కంటే ముందు తనకు ఇండస్ట్రీలో డెబ్యూ ఛాన్స్ ఇచ్చిన ఓ మాస్ హీరోకు వినిపించాడట సదరు దర్శకుడు. ఈ ఏడాది మూడు అతి పెద్ద డిజాస్టర్లు అందుకున్న ఆ మాస్ హీరో చేయాలనే ఆసక్తిని చూపించాడు. ఆ దర్శకుడు బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చి పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ మాస్ హీరోనే. అయితే చెప్పా పెట్టకుండా మరో హీరో దగ్గరికి వెళ్ళాడు ఈ డైరెక్టర్. అప్పటికే చాలా బ్యాడ్ టైం లో ఉన్న ఆ హీరో చేస్తానని చెప్పాడు. అయితే ఆరు ప్లాప్ లతో బ్యాడ్ పీరియడ్ లో ఉన్న ఆ హీరోతో చేయడం ఎందుకు లెమ్మని మరో హీరోతో ఓకే చేయించుకున్నాడు.
దీంతో ఇప్పుడా మాస్ హీరో ముందు ఓకే చెప్పిన మరో హీరో ఇద్దరు ఈ దర్శకుడి మీద బాగా కోపంగా ఉన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నెగటివ్ అయినా చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉందని ఇలా చొక్కాలు మార్చినంత సులభంగా హీరోలను మార్చుకుంటూ పోతాడా అంటూ తమ సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నట్టు సమాచారం. లౌక్యంగా వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పరిశ్రమలో ఇలాంటి తీరుతో ఆ దర్శకుడు ఎంతకాలం మన్నుతాడో అంటూ బయటికే కామెంట్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనం.