Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడు ట్రాక్ మార్చకపోతే కష్టమేనా?
By: Tupaki Desk | 19 Sept 2022 8:00 PM ISTఈ మధ్య ప్రమోషనల్ ఈవెంట్ లలో దర్శక, నిర్మాతలు, స్టార్స్ చెప్పే మాటలకు, సినిమా ఫలితాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. చెప్పిందొకటి చేసేదొకటి అన్నట్టుగా మారుతోంది. ఏ స్టార్ సినిమా తీసుకున్నా ఇదే వరస.. కొంత మంత మరీ మాటలతోనే సినిమా చూపించేస్తూ హడావిడీ చేసేస్తున్నారు. అది ఆకాస్త బెడిసి కొట్టడంతో బావురు మంటున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితినే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మూవీ టీమ్ ఎదుర్కొంటోంది.
నైట్రోస్టార్ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన మూవీ `సమ్మోహనం` సినిమాలో సినిమా అనే కాన్సెప్ట్ తో అలనాటి `సితార` కాన్సెప్ట్ ని మోడ్రనైజ్ చేసి ఈ మూవీని ఇంద్రగంటి తెరకెక్కించాడు. ఆ ఐడియా వర్కవుట్ కావడం, ఎమోషన్స్ పండటంతో `సమ్మోహనం` మంచి హిట్ అనిపించుకుంది. సినిమా కాన్సెప్ట్ తో చేసి ఈ మూవీ హిట్ అనిపించుకోవడంతో మళ్లీ అదే ఫార్ములాని వాడుకు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అంటూ మరో సినిమా తీశాడు.
సుధీర్ బాబు హీరోగా నటించగా `ఉప్పెన` బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఆకట్టుకునే స్థాయిలో లేకపోగా మళ్లీ `సమ్మోహనం`ని గుర్తు తెచ్చే స్థాయిలో వుండటంతో అంతా పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ డివైడ్ టాక్ ని దక్కించుకుంది. కొత్త కథ కాపోవడం.. చెప్పిన కథనే మార్చి సినిమాలో సినిమా అనే కాన్సెప్ట్ తో చేయడంతో చాలా వరకు నెటిజన్ లు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణపై సెటైర్లు వేస్తున్నారు.
చెప్పిందొకటి చేసేదొకటి మేకర్స్ మారరా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. కృతిశెట్టి ఈ మూవీలో అలేఖ్య, అఖిల అనే పాత్రల్లో డ్యుయల్ రోల్ లో నటించింది. సుధీర్ బాబు, కృతిశెట్టిల నటనకు కొంత మంది ఫిదా అవుతున్నా ఓవరాల్ స్టోరీ విషయంలో మాత్రం పెదవి విరుస్తున్నారు. అంతే కాకుండా ప్రమోషన్స్ లో దర్శకుడు చెప్పిందొకటి.. స్క్రీన్ పై చేసిందొకటి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఇంద్రగంటి తన తప్నుల్ని తెలుసుకుని ట్రాక్ మార్చకపోతే కష్టమనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.