Begin typing your search above and press return to search.
ఎనభై వసంతాల దర్శకేంద్రుడు
By: Tupaki Desk | 23 May 2022 10:36 AM GMTదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.. తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు. రొమాంటిక్ సాంగ్ లకు, హీరోయిన్ లని మరింత అందంగా చూపించడంతో ఆయనకు ఆయనే సాటి. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకేంద్రుడు స్వర్గీయ నందమూరి తారాక రామారవు నుంచి యంగ్ హీరో నితిన్ వరకు ఇలా ఎంతో మంది స్టార్ లతో కలిసి పని చేశారు.
ఎన్టీఆర్, ఆక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, నితిన్ వంటి హీరోలందరితోనూ కలిసి పని చేశారు. విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
వందకు పైగా సినిమాలు తెరకెక్కించిన టాలీవుడ్ లో దర్శకేంద్రుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నేడు (సోమవారం) ఆయన పుట్టిన రోజు. నేటిలో ఆయన 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 48 ఏళ్ల సుధీర్ఘ సినీ ప్రస్థానంలో 100 కు పైగా చిత్రాలు తెరకెక్కించారు. ఈ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ లు, సూపర్ హిట్ లు, హిట్ లు , డిజాస్టర్ లు ఎన్నో చూశారు. అయితే పాటల చిత్రీకరణ, హీరోయిన్ లని ఆ పాటల్లో చూపించే తీరు విషయంలో మాత్రం తన ప్రత్యేకతని చాటుకున్నారు.
ఇప్పటికీ ఎప్పటికీ పాటల్లో హీరోయిన్ లని అందింగా చూపించాలంటే రాఘవేంద్రరావు తరువాతే ఎవరైనా అనే బ్రాండ్ ని క్రియేట్ చేశారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు. తన ఎనభై ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలోని అనుభవాలని పొందు పరుస్తూ `నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ` అంటూ ఓ పుస్తకాన్ని రాశారు`. అది ఇటీవలే విడుదలైంది కూడా. 1963 లో కమలాకర కామేశ్వరరావు రూపొందించిన `పాండవ వనవాసం` చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్టీఆర్ పై క్లాప్ తో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
పదేళ్ల తరువాత తండ్రి కె.ఎస్. ప్రకాషరావు నిర్మించిన `బాబు` సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణ్నాన్ని బొదలు పెట్టారు. ఆ రోజు నుంచి దర్శకుడిగా ఎన్నో విజయాలు, పరాజయాలు.. కష్ట నష్టాలు చూశారట. అవార్డులు, రివార్డులు అందుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న రాఘవేంద్రరావు సోమవారం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్టార్ హీరోలు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఎనభై వసంతాల దర్శకేంద్రుడికి జన్మ దిన శుభాకాంక్షలు. శత వసంతాలు ఆయురారోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను` అని సోషల్ మీడియా వేదికగా రాఘవేంద్రావుతో కలిసి పంచుకున్న ఓ ఫొటోని అభిమానులకు షేర్ చేశారు చిరంజీవి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రుడికి ప్రత్యేకంగా విశేస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే మామయ్యా. గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీ నెస్ తో కలకాలం వుండాలని కోరుకుంటున్నా` అంటూ మహేష్ ట్వీట్ చేశారు.