Begin typing your search above and press return to search.
కళాతపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్
By: Tupaki Desk | 28 July 2018 4:19 AM GMTలెజెండరీ డైరెక్టర్ - కళాతపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్ మొదలైంది. `విశ్వనాధదర్శనం` అనేది టైటిల్. `వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ` అనేది ఉపశీర్షిక. రైటర్ కం డైరెక్టర్.. పరుచూరి శిష్యుడు జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గురుపౌర్ణమి వేళ ఈ సినిమా ముహూర్తం చేశారు. వివేక్ కూచిభొట్లతో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ బయోపిక్‌లో ఏం చూపించబోతున్నారు? అంటే.. కె.విశ్వనాథ్ బాల్యం - అటుపై గ్రేట్ ఫిలిం మేకర్ గా ఎదిగిన తీరును ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ - వైయస్సార్ బయోపిక్ - ఎంజీఆర్ బయోపిక్ ఇలా క్రేజీగా బయోపిక్ లు సెట్స్‌పై ఉన్న వేళ లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ బయోపిక్ సెట్స్‌కెళ్లడం సముచితమనడంలో సందేహం లేదు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి - గొప్ప గౌరవం అందుకున్న వైనాన్ని చూపించవచ్చు. ఒక లెజెండరీ తెలుగు డైరెక్టర్ జీవితకథను తెలుసుకునే భాగ్యం లోకానికి కలగనుంది.