Begin typing your search above and press return to search.
ఐఐటీకి కళాతపస్వి టెక్నిక్స్
By: Tupaki Desk | 23 Aug 2018 5:28 PM GMTబాహుబలి రిలీజ్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి టెక్నిక్ - మేధోతనంపై ఆసక్తికర చర్చ సాగింది. అది ఏ స్థాయిలో అంటే మద్రాస్ - చెన్నయ్ ఐఐటీల నుంచి ప్రత్యేకించి అతడికి ఆహ్వానం అందింది. అక్కడ తమ విద్యార్థులకు సినిమా టెక్నిక్ పై పాఠాలు చెప్పాల్సిందిగా ప్రొఫెసర్లే పిలిచారంటే అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి ఐఐటీ స్టూడెంట్స్ కి చెప్పిన క్లాసులు ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ విద్యార్థులు రాజమౌళి సినిమా టెక్నిక్ పైనా - ఆ సినిమా మేకింగ్ - బిజినెస్ పైనా కూలంకుశంగా అధ్యయనం చేశారు. దానిని థీసిస్ గానూ రాసుకున్నారు. అలాంటి అరుదైన గౌరవం దక్కేది ఏ కొద్దిమందికో.
రాజమౌళి తర్వాత నవతరం దర్శకుల్లో వేరే ఎవరికీ ఇలాంటి అవకాశం రాలేదు. అయితే రాజమౌళికి ఐఐటీల్లో - విద్యాసంస్థల్లో ఎంతటి గౌరవం దక్కుతుందో అంతకుమించి లెజెండరీ దర్శకుడు - కళాతపస్వి కె.విశ్వనాథ్ కి గౌరవం దక్కింది. నేడు వెటరన్ దర్శకుడు కే.విశ్వనాథ్ హైదరాబాద్ ఐఐటీలో క్లాసులు చెప్పారు. విద్యార్థులకు సినిమా టెక్నిక్స్ పై పాఠాలు చెప్పారు. తాను సినిమాల్లోకి వచ్చిన వైనంపైనా - ఇక్కడ సినిమాలు తీసేందుకు ఎంచుకున్న మార్గంపైనా ఎంతో విలువైన ఉద్భోద చేశారు. అసలు సినిమా ఎలా తీయాలో ఆయన నేటి క్లాస్‌లో కూలంకుశంగా చెప్పడం చర్చకొచ్చింది. ఇక ఈ పాఠాల్లో అసలు సన్నివేశం ఎలా పుడుతుంది..? రాసుకున్న స్క్రిప్టుని ఆన్ లొకేషన్ ఎలా మార్చాల్సి ఉంటుంది? లాంటి విషయాల్ని కే.విశ్వనాథ్ వివరించి చెప్పారు.
స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ రాధికను పెళ్లి చేసుకున్న తర్వాత వీరభద్రరావుని ఆస్తి ఇవ్వాలని అడుగుతాడు. అందుకు వీరభద్రరావు కోపంతో ఊగిపోతూ కమల్‌హాసన్‌ను తిడతాడు. ఆ సీన్ లో రాధికతో చాంతాడంత డైలాగులు చెప్పించాలనుకున్నాం. కానీ చివరకు ఒక్క మాటా లేకుండానే కత్తిరించేశాం. వీరభద్రరావును కొట్టమనే అర్థం వచ్చేలా రాధిక కమల్ హాసన్ చేతికి కర్ర ఇస్తుంది. ఆ సీన్ లో అంతకుమించిన డైలాగ్స్ అవసరం లేదు కదా. ఇలా ప్రతి సీన్ మార్చేందుకు ఆన్‌సెట్స్ ఏదో ఒకటి చేసేవాడిని అని అన్నారు లెజెండరీ దర్శకులు - కళాతపస్వి కె.విశ్వనాథ్. సంగీతం - నృత్యం - సామాజిక అంశాలే ప్రేరణగా కె.విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయాయి. అందుకే ఆయన హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులకు చెప్పిన క్లాసులపై ఫిలింనగర్ లో ఆసక్తి నెలకొంది. సమాజాన్ని, అందులో పాత్రల్ని చూసి సినిమాలు తీయాలని ఆయన విద్యార్థులకు చెప్పారు. మొత్తానికి ఐఐటీ విద్యార్థులకు ఇంతకంటే గొప్ప క్లాస్ వేరే ఇంకేం ఉంటుంది?