Begin typing your search above and press return to search.
సుక్కు శిష్యుడు నిలబడేనా?
By: Tupaki Desk | 17 April 2022 7:37 AM GMTఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది దర్శకులున్నారు. స్టార్ డైరెక్టర్స్ నుంచి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ వరకు తమ సత్తాని చాటుతున్నారు. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ సుక్క బ్యాచ్ పెరుగుతోంది. ఈయన స్కూల్ నుంచి వస్తున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కానీ సక్సెస్ అవుతున్న వారి సంఖ్య మాత్రం పెరగడం లేదు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన మరో అసిస్టెంట్ అంటే సహాయ దర్శకుడు డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
దిల్ రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా కొత్త చిత్రం `సెల్ఫిష్` ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా సుకుమార్ మాజీ అసోసియేట్ కాశి విశాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దాదాపు సుక్కు వద్ద 5 ఏళ్ల పాటు అసోసియేట్ గా వర్క్ చేసిన కాశీ విశాల్ `సెల్ఫిష్` మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఓ చర్చ మొదలైంది.
ఇండస్ట్రీలో వున్న టాప్ డైరెక్టర్ లైన త్రివిక్రమ్, రాజమౌళి, బోయపాటి శ్రీను ల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన చాలా మంది దర్శకులుగా నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరూ పెద్దగా రాణించలేదు. కానీ సుకుమార్ స్కూల్ నుంచి వచ్చి వాళ్లలో కొంతలో కొంత వరకు నిలబడ్డారు. మంచి విజయాల్ని అందించారు. ఓ అసిస్టెంట్ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ నే అందించి గురువుగా సుక్కుని గర్వపడేలా చేశాడు. సుకుమార్ స్కూల్ నుంచి ఇప్పటి వరకు నలుగురు దర్శకులుగా పరిచయం అయ్యారు.
`కుమారి 21 ఎఫ్` తో పల్నాటి సూర్య ప్రతాప్, దర్శకుడు సినిమాతో హరి ప్రసాద్ జక్కా, `చక్కిలి గింత` తో వేమారెడ్డి, `ఉప్పెన`తో సానా బుచ్చిబాబు దర్శకులుగా పరిచయం అయ్యారు. అయితే ఇందులో సానా బుచ్చిబాబు మాత్రమే `ఉప్పెన` తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. అయితే మిగతా వాళ్లు మాత్రం ఇప్పటికీ దర్శకులుగా స్ట్రగుల్ అవుతూనే వున్నారు.
ఈ దశలో సుక్కు దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన కాశీ విశాల్ దర్శకుడిగా `సెల్ఫిష్` మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు, శిరీష్ ల వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇటీవలే మొదలైంది. తెలంగాణ స్లాంగ్ లో సాగే ఈ మూవీలో సుక్కు శిష్యుడు డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడా? అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాశీ.. బుచ్చిబాబులా సక్సెస్ అవుతాడా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.