Begin typing your search above and press return to search.
ఒక లైలాతో హ్యాపీగా రిసెప్షెన్
By: Tupaki Desk | 22 Jun 2017 5:50 AM GMTఇండస్ట్రీలో ఒక హిట్ దొరికితే డైరెక్టర్ కు మంచి ప్లాట్ ఫాం పడినట్టే. రెండో హిట్ కొడితే వన్ ఫిలిం వండర్ కాదని నిరూపించుకోగలిగినట్టే. దాంతో డైరెక్టర్ గా ఛాన్సులు బాగానే దొరుకుతాయి కాబట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే యంగ్ డైరెక్టర్స్ దాదాపు ఇదే ప్లాన్స్ తో వస్తారు. వీళ్లలో కొంతమంది ప్లాన్స్ వర్కవుట్ అవుతాయి. మరికొంతమంది ప్లాన్స్ బోల్తా పడతాయి. కెరీర్ లో మంచి సక్సెస్ సాధించాకే డైరెక్టర్ క్రిష్ కూడా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. మరో దర్శకుడు ఇదే బాటలో ముందుకెళ్తున్నాడు.
నితిన్-నిత్యామీనన్ జంటగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మెగాఫోన్ పట్టాడు కొండా విజయ్ కుమార్. ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో తర్వాత నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తీసిన ఒక లైలా కోసం బాగానే ఆడింది. దీంతో తన జీవితంలో లైలాను వెతుక్కుని మ్యారీడ్ లైఫ్ లోకి అడుగు పెట్టాడు. హైదరాబాద్ కు చెందిన ప్రసూన మెళ్లో మూడు ముళ్లు వేశాడు. తాజాగా వీళ్ల పెళ్లి రిసెప్షన్ సింపుల్ గా జరిగింది. ఇండస్ట్రీలోని పలువురు కామెడీ యాక్టర్లు ఇతర సెలబ్రిటీలు ఈ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. విజయ్ కుమార్ పెళ్లి మార్చి 1నే అయ్యింది. ఆ తరువాత అతని భార్య తరుపువారు మా అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయి.. దాదాపు నాలుగు నెలలు తరువాత మనోడు రిసెప్షన్ ఇచ్చాడు. కాదు.. అమ్మాయి తరుపువారే స్వయంగా ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బహుశా ఫ్యామిలీలో గొడవలన్నీ సెటిల్ అయిపోయిన్నట్లున్నాయ్. కంగ్రాట్స్ విజయ్!!