Begin typing your search above and press return to search.
అదే కానీ శ్రియలో లేకుంటే !?
By: Tupaki Desk | 15 Jan 2017 10:46 AM GMTసంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో అందరి నోట నానున్న చిత్రాల్లో ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ తర్వాత అందరూ మాట్లాడుతున్న వ్యక్తుల్లో బాలయ్య.. శ్రియలు ఉంటారు. గ్లామర్ పాత్రలకు మాత్రమే సూట్ అవుతుందని ఫీలయ్యే వారందరికి తన నటనతో షాకిచ్చిన ఆమె.. తన అందచందాలతో వెండితెరకు మరింత కళ తెచ్చిందని చెప్పక తప్పదు.
శాతకర్ణి సతీమణి వశిష్ఠి క్యారెక్టర్ ను క్రిష్ తీర్చి దిద్దిన తీరుతో.. శ్రియకు మరింత ప్లస్ అయ్యింది. ఇటీవల కాలంలో అగ్రహీరోల సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇంతగా చర్చ జరుగుతున్న సినిమా శాతకర్ణి మాత్రమేనని చెప్పక తప్పదు. ఇంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వశిష్ఠి క్యారెక్టర్ శ్రియకే ఎందుకు దక్కింది? ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న ఆసక్తి చాలామందికే కలిగింది. అయితే.. దీనికిసమాధానం దొరకని పరిస్థితి.ఆ కొరతను తీరుస్తూ.. శ్రియను ఎందుకు ఎంపిక చేసుకున్న విషయాన్ని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చారు.
ఈ క్యారెక్టర్ ను రాసుకున్నప్పుడే.. శ్రియ తన మనసులో మెదిలిందని.. ఎందుకంటే.. ఆమె కళ్లు పెద్దవిగా ఉంటాయని.. అదే తనకు కావాల్సిందని.. వశిష్ఠి క్యారెక్టర్ కు పెద్ద కళ్ల ప్రాధాన్యత చాలా ఉందని చెప్పారు. అందుకే.. శ్రియను ఎంపిక చేశామని.. తన నిర్ణయాన్ని బాలయ్యకు చెబితే గుడ్ చాయిస్ అన్నారని చెప్పారు. వశిష్ఠి క్యారెక్టర్ కు శ్రియే ఎందుకన్నది అర్థమైందా?