Begin typing your search above and press return to search.
ఆయన ఈయనేనా! ఏంటండోయ్ ఈ మార్పు?
By: Tupaki Desk | 24 Nov 2022 7:30 AM GMTనేను తీరైన ఆకృతికోసం శస్త్ర చికిత్స చేయించుకున్నాను.. అయితే ఏంటట? అని ప్రశ్నించిన కథానాయికలు ఎందరో. తన ముక్కుకు సర్జరీ జరిగిందని నిజాయితీగా అంగీకరించింది శ్రుతిహాసన్. తన ముఖంలో పోలికలు అనేవి తెలీనంతగా తనను తాను మార్చుకునేందుకు ఎన్నో శస్త్ర చికిత్సలను చేయించుకున్న మైఖేల్ జాక్సన్ సైతం దానిని ఏనాడూ దాచలేదు. ఇక వీళ్ల బాటలోనే నటి షామా శికందర్ సైతం శస్త్ర చికిత్సతో ముఖ మార్పిడి గురించి బహిరంగంగానే ముచ్చటించింది.
ఇవన్నీ అటుంచితే టాలీవుడ్ లో అగ్ర హీరోలంతా నెత్తి మీద వెంట్రుకలు లేకపోయినా చెరిగిపోని సైడు క్రాఫ్ తో ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు. నిజానికి అది ఒరిజినలా డూప్లికేటా? కనిపెట్టడం కష్టం. నిజానికి విగ్గు లేని జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితి వీళ్లది. విగ్గు తీసి ఆరుబయట కనిపించరు. సూపర్ స్టార్లు అని పిలుపించుకునే వాళ్లంతా నిజ రూపం వేరుగా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయితే తమను ఆరాధించే అభిమానుల కోసం.. మార్కెట్ లో డ్యామేజీని ఆపడం కోసం ఆమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మన హీరోలకు చాలా అవసరం. చాలా మంది టాలీవుడ్ బాల్డ్ హెడ్ హీరోలు రజనీకాంత్ అంత నిజాయితీగా పబ్లిక్ లోకి రాలేరు.
ఇకపోతే ఇప్పుడు దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) వీళ్లందరికీ అతీతం. అసలు ఆయనకు ఇలాంటివేవీ పట్టవు. ఎప్పుడూ పని రాక్షసుడిలా తన కెరీర్ గురించి ఆలోచిస్తారు. తన బాల్డ్ హెడ్ గురించి ఆయన ఏనాడూ పట్టించుకున్నది లేదు. పెళ్లి టైమ్ లోను ఒరిజినాలిటీతోనే కనిపించారు. కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్ అప్పియరెన్స్ సడెన్ షాకిచ్చింది. అతడు అందమైన సైడ్ క్రాఫ్ తో ఇస్మార్ట్ గా కనిపించాడు. మునుపటితో పోలిస్తే అసలు పోలికే లేదు. ఆయన ఈయనేనా? అంటూ చూసినవాళ్లంతా సడెన్ గా షాకయ్యారు. అంతగా మేకోవర్ చూపించారాయన.
నిజానికి క్రిష్ కి చిన్న వయసు నుంచే హెయిర్ ఫాల్ ని ఎదుర్కొన్నారు. బట్ట తల బహిర్గతమైపోయినా ఆయన ఏనాడూ దానిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అతడు ప్రతిదీ ఓపెన్ గా ఉంటారు. సౌందర్యంపై దృష్టి కంటే కెరీర్ కోసం ఎక్కువగా తపించిన గొప్ప దర్శకులు ఆయన. కానీ ఇప్పుడు కొంత తీరిక చిక్కగానే ఇలా రూపాన్ని కూడా మార్చారు. అతడి బాల్డ్ హెడ్ మాయమై ఇప్పుడు నిండైన వెంట్రుకలతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. చిరు- పవన్ ముచ్చట్లాడుకుంటున్న వేళ క్రిష్ ఆ ఇద్దరి పక్కనే నిలుచుని ఇలా కనిపించారు.
ఇకపోతే నేటితరానికి బాల్డ్ హెడ్ దిగులు అక్కర్లేదు. ఇప్పుడు అంతా అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ఘనాపాటీలైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. చాలా పరిమితమైన ఖర్చుతోనే వెంట్రుకలు మొలిపించేస్తున్నారు. సక్సెస్ రేటు వంద శాతం చూపిస్తున్నారు. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు సైతం ఈ వైద్యం అందుబాటు ధరల్లోనే ఉంది.
క్రిష్ లుక్ చూస్తుంటే అది విగ్గులా లేదు. అది రియల్ గా ఎదిగిన జుట్టులానే అనిపిస్తోంది. దానికోసం సరైన చికిత్సను క్రిష్ అనుసరించి ఉంటారని భావిస్తున్నారు. ఇక బట్టతల నుంచి యువతరాన్ని బయటపడేసే టాప్ క్లాస్ డాక్టర్లు హైదరాబాద్ లో కోకొల్లలుగా ఉన్నారు. వీళ్లంతా క్షణం తీరిక లేకుండా దండీగానే సంపాదిస్తున్నారన్నది తాజా సర్వే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.