Begin typing your search above and press return to search.
క్రిష్ పేరు ఆలా పుట్టిందట
By: Tupaki Desk | 12 Sep 2017 3:30 PM GMTటాలీవుడ్ లో ఎంత మంది దర్శకులున్నా మంచి కథాంశంతో ఓ పదేళ్లు సినిమా గుర్తుండి పోయేటట్లు సినిమా తీసేవాళ్ళు కొంతమందే ఉంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు జాగర్లమూడి రాదా కృష్ణ (క్రిష్) ఒకరు. గమ్యం సినిమాతోనే మంచి దర్శకుడిగా అవార్డులను అందుకున్న క్రిష్ ఆ తర్వాత వేదం సినిమాతో మానవత్వం విలువలని తెరపై చూపించాడు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా క్రిష్ మంచి దర్శకుడు అనే ముద్ర వేసుకున్నారు. ఇక కంచె సినిమాతో కమర్షియల్ హిట్ అందుకొని బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించి మరో స్థాయికి చేరాడు. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ దర్శకుడి పేరు వెనుక ఒక పెద్ద కథే ఉందట.
జాగర్లమూడి రాదా కృష్ణ తన పూర్తి పేరు కానీ తాను కొన్ని కారణాల వల్ల క్రిష్ అని మార్చుకున్నాడట. వివరాల్లోకి వెళితే.. రాధాకృష్ణ అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ఓ ఫైనాన్స్ ఆఫీస్ లో జాబ్ చేసేవాడు. అయితే అక్కడ స్టాఫ్ ఎక్కువగా అమెరికన్స్ ఉండడంతో రాధాకృష్ణ జాగర్లమూడి పేరును సరిగ్గా పలికేందుకు వచ్చేది కాదట. ముడి-జాడి-ర్యాధా-క్రిష్ణా అని పిలిచి కాస్త కోపాన్ని తెప్పించేవారట. ఎంతో ప్రేమగా తన తాతయ్య పెట్టిన పేరును ముక్కలు ముక్కలుగా విడగొట్టి పలికితే రాధాకృష్ణ కి ఏ మాత్రం నచ్చేది కాదు. దీంతో ఆఫీస్ లో ఉండే అందరికి ఒకేసారి గ్రూప్ మెయిల్ పెట్టాడట. ఇక నుంచి నన్ను క్రిష్ అని పిలవనుని చెప్పడంతో ఇక అక్కడి నుంచి రాధాకృష్ణ నిక్ నేమ్ అమెరికాలో పుట్టి ఇండియాలో కూడా అదే పేరు కొనసాగింది.
అయితే ఇక్కడ కూడా అదే పేరు పెట్టుకోవడానికి ఇబ్బందేంటి రాధాకృష్ణ అందరికి పలకడం వచ్చుకదా అని అంటే.. క్రిష్ ఓ సమాధానాన్ని ఇచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది రాధాకృష్ణలు ఉన్నారు. సో కన్ఫ్యూజన్ ఎందుకని స్క్రీన్ పై కూడా క్రిష్ అని వేసుకుంటున్నా అని ఈ దర్శకుడు తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చాడు.