Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో మరో కరణ్ జోహార్?
By: Tupaki Desk | 10 Aug 2018 4:06 AM GMTఏదో ఒక విద్యలో ఆరితేరితే సరిపోదు ఇక్కడ. సకలకళాపోషకుడిలా ఉంటేనే మనుగడ! ఎన్ని విద్యలు తెలిస్తే అంతా ఆర్జనకు ఆస్కారం ఉంటుంది పరిశ్రమలో. ఇలాంటి విద్యల్లో ఆరితేరిపోయిన మహానుభావులెందరో ఫిలింనగర్ లో ఉన్నారు. అయితే ఆ మహానుభావుల్లో స్టార్ డైరెక్టర్ క్రిష్ పేరు అగ్రపథాన ఉంటుంది. క్రిష్‌లో స్కిల్స్ అపారం. మొదట అతడు రచయిత.. ఆ తర్వాత దర్శకుడు.. అలానే నిర్మాత. బుల్లితెర - వెండితెర ఏదైనా అక్కడ ఈ మూడు కళల్ని అవలీలగా పోషించగలడు. అందుకే ఎదురేలేనివాడిగా ఇంతింతై అన్న చందంగా అలా అలా ఎదిగేస్తున్నాడు.
`గమ్యం` సినిమాతో తన గమ్యమే మారిపోయింది. అంతవరకూ టీవీ పరిశ్రమతో అనుబంధం ఉన్న క్రిష్ - అటుపై సినీదర్శకుడిగా ఒక్కో సినిమా చేస్తూ స్కైని టచ్ చేస్తున్నాడు. `గౌతమిపుత్ర శాతకర్ణి` ఘనవిజయంతో క్రిష్ రేంజు మరో లెవల్ ని టచ్ చేసింది. బాలీవుడ్ లో గబ్బర్ తర్వాత `మణికర్ణిక` లాంటి ఛాలెంజింగ్ హిస్టారికల్ మూవీని చేస్తూ అందరి నోళ్లలో నానుతున్నాడు. వారియర్ క్వీన్ ఝాన్సీ రాణి విరోచిత చరిత్రను తెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నాడు.
ఇన్ని విద్యల్ని ఏకకాలంలో ఆచరిస్తూనే - సినిమా - టీవీ సీరియళ్ల నిర్మాణంపైనా అతడు కాన్సన్ ట్రేట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. దర్శకనిర్మాత - రచయిత .. ఆల్ రౌండర్ అని నిరూపించుకోవడమే ధ్యేయంగా అతడు ముందుకు కదులుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం `పల్లెటూరి పిల్ల` అనే టీవీ సీరియల్ నిర్మిస్తున్నాడు. దీనికి స్క్రిప్టు తనదే. ఇది టాలీవుడ్ బుల్లితెరకు కొత్త రంగులు అద్దుతుందని - రొటీన్ టీవీ సీరియల్ లా కాకుండా చిన్న తెరపై పెద్ద సినిమాలా ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా క్రిష్ స్కెచ్ మామూలుగా లేదు. ఓవైపు దర్శకరచయితగా క్షణం తీరిక లేకుండానే .. మరోవైపు ఇలా టీవీ సీరియళ్లు నిర్మిస్తూ - వాటికి రచన చేస్తూ గ్రేట్ ప్లానర్ గా ఉన్నాడు. బుల్లితెర - పెద్ద తెర రెండిటినీ ఏలే కరణ్ జోహార్ లా సత్తా చాటుతున్నాడు. ఒక రకంగా అతడిని టాలీవుడ్ కరణ్ జోహార్ అని పిలిస్తే తప్పేం కాదేమో?