Begin typing your search above and press return to search.

క్రిష్ భలే తెలివిగా తప్పించుకున్నాడే

By:  Tupaki Desk   |   20 Dec 2018 6:15 AM GMT
క్రిష్ భలే తెలివిగా తప్పించుకున్నాడే
X
ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో తలమునకలై ఉన్న దర్శకుడు క్రిష్ కు వచ్చే ఏడాది మొదటి రెండు నెలల కాలం కెరీర్లోనే చాలా స్పెషల్ గా నిలవబోతోంది. కారణం ఎన్టీఆర్ రెండు భాగాలతో పాటు మణికర్ణిక కేవలం నెల రోజుల వ్యవధిలో జనవరి 9 నుంచి ఫిబ్రవరి 7 మధ్యలో విడుదల కాబోతున్నాయి. ఇప్పుడున్న దర్శకుల్లో ఇలా ఇంత తక్కువ గ్యాప్ లో మూడు సినిమాలు విడుదల కావడం ఎవరికీ జరగలేదు. ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. కాని క్రిష్ దాన్ని ఘనతగా ఫీలవ్వడం లేదు.

కారణం మణికర్ణిక వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉండటమే. క్రిష్ వదిలేసిన భాగాన్ని తన చేతుల్లోకి తీసుకుని మొత్తం తానే తీసినట్టు గా బాలీవుడ్ మీడియా కు చెప్పుకుంటున్న కంగనా అలాంటి స్టేట్మెంట్స్ ద్వారా వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తోంది కాని క్రిష్ తన మానాన తానుంటూ నిర్మాతగా వ్యవహరించిన అంతరిక్షం విడుదలతో పాటు ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ పనుల్లో బిజీ అయిపోయాడు. నిజానికి కంగనా చాలా ప్లాన్డ్ గా క్రిష్ ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. 70 శాతం షూటింగ్ తనే చేసానని చెప్పుకుంటే అప్పుడు క్రిష్ బయటికి వచ్చి ఏదో ఒకటి చెబుతాడు దానికి మళ్ళి కౌంటర్ ఇవ్వొచ్చు ఇలా మణికర్ణికను మీడియా లో నానుతూ ఉండేలా చేయొచ్చని తన ప్లానట.

గతంలో తను వెడ్స్ మను రిలీజైనప్పుడు సినిమా వారసుల మీద విరుచుకుపడి తన మీద అటెన్షన్ వచ్చేలా చేసుకుంది. సిమ్రాన్ విడుదల టైంలో హృతిక్ రోషన్ తో గొడవను తీసుకొచ్చింది. అవన్నీ ప్లస్ అయ్యి కంగనా పేరు మ్రోగిపోయేలా చేసాయి. అయితే కంగనా ప్లాన్ ఈ సారి వర్క్ అవుట్ కావడం లేదు. టైటిల్ కార్డ్స్ లో తన పేరు మీద క్రిష్ పేరు వేసి సినిమా మొత్తం తానే తీసానని చెప్పుకుంటున్నా క్రిష్ చీమ కుట్టినట్టుగా కూడా స్పందించకపోవడం చూస్తే పాపం ఈసారి కంగనా ప్లాన్ రివర్స్ అయినట్టే ఉంది. ట్విట్టర్ లో ట్రైలర్ ను షేర్ చేయడం తప్ప క్రిష్ మణికర్ణిక గురించి ఎక్కడా మాటవరసకు సైతం ప్రస్తావన తీసుకురావడం లేదు